Credit card utilization for best Credit score :మీరు క్రెడిట్ కార్డును కలిగి ఉన్నారా? పరిమితికి మించి దానిని ఉపయోగిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.
రుణార్హతను దెబ్బతీస్తాయి
Credit Card Can Hurt Your Creditworthiness : బ్యాంకులు ఒక వ్యక్తికి రుణాలు మంజూరు చేయాలనుకున్నప్పుడు ముందుగా క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్‌ను అనుసరించి మాత్రమే ఆ వ్యక్తి రుణం తీసుకునే అర్హత ఉందా? లేదా? అనేది నిర్ణయిస్తాయి. ఒక క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు అప్పు ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. అదే విధంగా వడ్డీ రేట్లలో రాయితీ పొందాలన్నా కూడా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. వాస్తవానికి వీటన్నింటినీ మన క్రెడిట్ కార్డ్ వినియోగం ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అందుకే క్రెడిట్ కార్డ్ వినియోగంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలి.
క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి
how to improve your credit score : క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు అప్పులు ఎలా చెల్లిస్తున్నారు అనే దానిని అనుసరించి క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుంది. బిల్లులు సకాలంలో చెల్లిస్తుంటే, మన క్రెడిట్ స్కోర్ మంచిగా పెరుగుతుంది. కేవలం ఒక్క రోజు ఆలస్యమైనా మన క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అలాగే క్రెడిట్ బిల్లులపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడాలి
proper use of credit card : మనలో చాలా మంది తమ క్రెడిట్ కార్డును పరిమితి ఉన్నంత మేరకు వాడేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. క్రెడిట్ కార్డు పరిమితిలో 30 నుంచి 40 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా తక్కువ పరిమితి ఉన్న కార్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.