Credit Card Network Portability : ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు.. అది మన చేతికి అందేదాకా.. ఏ కార్డు వస్తుందో తెలియదు. రూపే కార్డు ఇవ్వాలా?, మ్యాస్ట్రో, వీసా కార్డా? అన్నది బ్యాంకులే నిర్ణయిస్తాయి. అయితే.. మీకు అందిన క్రెడిట్ కార్డు సేవలు సరిగా లేవని భావిస్తే ఏం చేయాలి? అనే ప్రశ్నకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆర్బీఐ సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సమస్యకు పరిష్కారంగా.. క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ(Credit Card Portability) ఆప్షన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ అంటే ఏమిటి? ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ (What is Credit Card Portability) :మనకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(Mobile Number Portability) గురించి తెలిసిందే. మనం వాడుతున్న నెట్ వర్క్ సేవలు నచ్చకపోతే.. అదే మొబైల్ నంబర్ మీద వేరే నెట్ వర్క్‌కు మారిపోతాం. ఇక నుంచి.. డెబిట్/క్రెడిట్/ ప్రీపెయిడ్ కార్డుల విషయంలోనూ సరిగ్గా ఇలాంటి మార్పే చేయాలనుకుంటోంది రిజర్వ్ బ్యాంక్. దీనికి 'క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ' అని పేరు కూడా పెట్టింది. ఇది అందుబాటులోకి వస్తే వినియోగదారుడు తనకు నచ్చిన పేమెంట్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. అంటే మాస్టర్ నుంచి రూపేకు, వీసా నుంచి మాస్టర్‌కు.. ఇలా మీకు నచ్చిన కార్డు నెట్‌వర్క్‌కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తోంది ఆర్‌బీఐ.
డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
When Credit Card Portability will Available?
క్రెడిట్ కార్డు పోర్టబిలిటీ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది..?క్రెడిట్/డెబిట్/ప్రీపెయిడ్ కార్డ్ కస్టమర్లకు ఈ పోర్టబిలిటీ సౌకర్యం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ(RBI) సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో.. వీసా (Visa), మాస్టర్ కార్డ్ (MasterCard), రూపే (RuPay), అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (American Express), డైనర్స్ క్లబ్ (Diners Club) వంటి సంస్థలు ఈ నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఈ సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. దీని ప్రకారం.. వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది ఈ సంస్థలే నిర్ణయిస్తాయి. కానీ.. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం.. తాను ఏ కార్డు పొందాలన్నది వినియోగదారుడి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.