Reasons for a Credit Card Cancellation : ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డుల వినియోగం పెంచేందుకు తమ ఖాతాదారులకు పదేపదే మెసేజ్‌లు, కాల్లు చేస్తూ వస్తున్నాయి. అలాగే ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉన్నవారిని మరింత ప్రోత్సహించేందుకు.. ప్రత్యేక రివార్డులు, క్యాష్ ప్రైజులు, ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ ఇటీవల చాలా ప్రైవేట్ రంగ బ్యాంకులు అనేక మందికి సంబంధించిన క్రెడిట్ కార్డులను రద్దు చేశాయి. ఇలా ఎందుకు చేస్తున్నాయో తెలుసా?
ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి నెలకు రూ.4 లక్షలు చొప్పున నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో టైర్ -2 అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేశాడు. వాస్తవానికి ఈ స్కీమ్‌లో టైర్ -1, టైర్ -2 అకౌంట్ల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే టైర్-1 అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే.. లాంగ్ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అందువల్ల రిటైర్మెంట్ అయినంత వరకు ఈ స్కీమ్‌లోని డబ్బులు వాపసు తీసుకోవడానికి వీలుపడదు. అదే టైర్-2 అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే.. ఈ లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. అందుకే అతను టైర్-2 అకౌంట్ ద్వారా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. ఇందుకోసం అతను తన క్రెడిట్ కార్డు ఉపయోగించాడు. దీని వల్ల అదనంగా రివార్డ్ పాయింట్లు కూడా వస్తాయని ఆశించాడు. ఆ తరువాత అదే ఎన్పీఎస్-2లోని డబ్బులు విత్‌డ్రా చేసి, తన క్రెడిట్ కార్డు బిల్లు కట్టేశాడు. దీని వల్ల మరలా ఉచితంగా రివార్డ్ పాయింట్లు సంపాదించాడు. అతని అతితెలివిని గుర్తించిన సదరు ప్రైవేట్ బ్యాంకు.. వెంటనే క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే, అతను చేసిన పని బ్యాంకు రివార్డ్ పాలసీకి పూర్తిగా వ్యతిరేకం కనుక. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
రోజు వారీ ఖర్చులకు వినియోగిస్తున్నారా?
Credit card daily transaction limit : ఇటీవలి కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను తమ రోజువారీ లావాదేవీల కోసం కూడా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాష్ లెస్ ట్రాన్స్ఫర్స్ కావడం సహా రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలు కలుగుతుండడమే ఇందుకు కారణం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలకు, లేదా బ్యాంకులకు కొన్ని పాలసీలు, నియమనిబంధనలు ఉంటాయి. వాటిని వినియోగదారులు చాలా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక వేళ వీటిని ఉల్లంఘిస్తే.. మీ క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది.
ఏయే సందర్భాల్లో క్రెడిట్ కార్డు రద్దు అవుతుంది?
Credit card late or pending payment : క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు ఆలస్యమైనా, లేదా పూర్తిగా చెల్లించడం మానివేసినా.. క్రెడిట్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి క్రెడిట్ కార్డు వలన బ్యాంకులకు వడ్డీ, ఫీజులు కలిసి వస్తాయి. దీని వలన వారికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒక వేళ మీరు సకారంలో బిల్లులు చెల్లించకపోతే.. అది బ్యాంకుల క్యాష్ ఫ్లోకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల అలాంటి వారి క్రెడిట్ కార్డులను బ్యాంకులు రద్దు చేస్తాయి. దీనికి తోడు ఇది క్రెడిట్ స్కోర్‌పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఆటోమేటిక్ పేమెంట్స్ లేదా రిమైండర్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం.