Crypto consultation paper: క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి కీలక ప్రకటన చేశారు. క్రిప్టోలపై త్వరలోనే కన్సల్టేషన్ పేపర్‌తో ముందుకు రానున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దీనిపై ప్రకటన చేశారు. కన్సల్టేషన్ పేపర్ దాదాపుగా సిద్ధమైందని చెప్పారు. ఏదైనా ఓ అంశంపై నిపుణుల అభిప్రాయాలను తీసుకొని రూపొందించే పత్రాన్నే కన్సల్టేషన్ పేపర్ అంటారు.
"కన్సల్టేషన్ పేపర్ దాదాపుగా సిద్ధమైంది. దీనిపై చాలా లోతుగా పరిశీలన చేపట్టాం. దేశీయ నిపుణులనే కాకుండా, అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులను సైతం సంప్రదించాం. త్వరలోనే కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేస్తామని అనుకుంటున్నాం" అని అజయ్ సేఠ్ పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక ప్రకటన.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌తో కలిసి... - క్రిప్టో కరెన్సీ ఇండియా
Crypto consultation paper: క్రిప్టోకరెన్సీల విషయంలో కన్సల్టేషన్ పేపర్ రూపకల్పన తుది దశకు చేరుకుందని.. త్వరలోనే దీన్ని విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. కన్సల్టేషన్ పేపర్‌ను రూపొందించేందుకు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లను సైతం సంప్రదించినట్లు తెలిపారు.
క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ లేనందున ఇందుకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని సేఠ్ పేర్కొన్నారు. క్రిప్టో విసిరే సవాళ్లను అంతర్జాతీయ స్థాయిలో ఓ అంగీకారంతో ఎదుర్కోవాలని అన్నారు. ఈ మేరకు విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనలు రూపొందించే విషయంపై ఇప్పటి నుంచే తాము పనిచేస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. 'క్రిప్టోలపై విధించే నిషేధం పనిచేయదు.. దేశాలు సొంతంగా ఏం పని చేసినా.. అది విఫలమవుతుంది. ఇందుకోసం అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం ఉండాల్సిందే' అని అన్నారు సేఠ్.
ఇదీ చదవండి: