Commercial LPG Prices Cut : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీసీ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.158 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
నగరాలు - గ్యాస్ సిలిండర్ ధరలు
Commercial LPG Gas Price Today :
- కొత్త ధరలు నేటి నుంచే అమలు కావడం వల్ల దిల్లీలో రిటైల్ 19కేజీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,522కు చేరుకుంది.
- కోల్‌కతాలో రిటైల్ 19కేజీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,644.50కు చేరుకుంది. చెన్నైలో రూ.1694.50, హైదరాబాద్‌లో రూ.1760, విజయవాడలో రూ.1692.50గా సిలిండర్ ధర ఉంది.
నోట్ : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు నెలలోనూ కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించాయి.
రక్షా బంధన్ కానుక
Domestic Gas Cylinder Price :కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా ఆగస్టు 29న వంట గ్యాస్ ధరలను రూ.200 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వంట గ్యాస్ వినియోగదారులందరీ ముఖ్యంగా మహిళలకు లబ్ధి చేకూరినట్లు అయ్యింది.
ప్రతి నెలా మొదటి రోజున..
Gas Price Revision India :వాస్తవానికి ప్రతి నెలా మొదటి రోజున గ్యాస్, చమురు ధరలను రివైజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఎల్పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే.. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైడ్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.
ఎల్పీజీ దిగుమతులపై అగ్రి సెస్ మినహాయింపు
Agri Cess On Gas Imports In India : కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, లిక్విఫైడ్ ప్రొపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్ దిగుమతులపై ఉన్న 15 శాతం అగ్రి సెస్‌పై మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నట్లు స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ జులై నెలలో ఎల్పీజీ, లిక్విఫైడ్ ప్రొపేన్, లిక్విఫైడ్ బ్యూటేన్ దిగుమతులపై 15 శాతం వరకు అగ్రి సెస్ విధించింది. తాజాగా ఆ అగ్రి సెస్ నుంచి మినహాయింపు ఇచ్చింది.