CNG Or Petrol Car Which is Better :కారు అంటే గతంలో డీజిల్ లేదా పెట్రోల్‌తో మాత్రమే నడిచేది. కానీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు CNG కార్లు కూడా రోడ్లపై దూసుకెళ్తున్నాయి. మరి.. ఇప్పడు కారు కొనుగోలు చేయాలంటే.. ఏది బెస్ట్..? సీఎన్‌జీ కారు కొంటే మంచిదా? పెట్రోల్ కారు తీసుకుంటే బాగుంటుందా? అనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి.. వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సీఎన్‌జీ అంటే..?
సీఎన్‌జీ అంటే కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్. ఇందులో మిథేన్ వాయువు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ గ్యాస్ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారు.. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు.. చాలా వరకు సీఎన్‌జీ వాహనాలు పెట్రోల్‌తో కూడా నడుస్తాయి. ఈ కారణంతోనే వీటిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
CNG కార్లతో లాభాలు..
- పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. సీఎన్‌జీ కార్లు పర్యావరణానికి పెద్దగా హాని చేయవు.
- సీఎన్‌జీ వాహనాలు తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలను రిలీజ్ చేస్తాయి.
- సీఎన్‌జీ ఇంజిన్‌తో ఇంధన అవశేషాలు చాలా తక్కువగా వెలువడుతాయి. ఫలితంగా.. కారు ఇంజిన్‌లోని పైపులు, ట్యూబులు త్వరగా దెబ్బతినవు.
- పెట్రోల్‌ను లీటర్లలో కొలిస్తే, సీఎన్‌జీను కేజీల్లో కొలుస్తారు. కేజీ సీఎన్‌జీ ధర లీటర్ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది.
- సీఎన్‌జీ కార్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
- ఇవి పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి.
CNG కార్లతో నష్టాలు..
- సీఎన్‌జీ కారు బూట్ స్పేస్‌లో గ్యాస్ సిలిండర్ ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఎక్కువ లగేజీని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు.
- పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్ల పికప్ తక్కువగా ఉంటుంది.
- సీఎన్‌జీ 12 కేజీల సిలిండర్‌లో.. 85 శాతం వరకు మాత్రమే గ్యాస్ నింపవచ్చు.
- పెట్రోల్ బంకుల్లాగా అన్ని చోట్ల సీఎన్‌జీ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లు లేకపోవడం ప్రధాన సమస్య.
- సీఎన్‌జీ కార్లలో బ్రాండెడ్ కిట్ వాడకపోతే సమస్యలు వస్తాయి.