తెలంగాణ

telangana

ETV Bharat / business

CNG కార్స్​పై భారీ డిస్కౌంట్స్​ - ఏ మోడల్​పై ఎంతంటే? - tata cars December discounts

CNG Cars Discounts December 2023 In Telugu : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్. మారుతి సుజుకి, టాటా, టయోటా, హ్యుందాయ్ లాంటి టాప్​ ఆటోమొబైల్ కంపెనీలు, తమ సీఎన్​జీ కార్లపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ ప్రకటించాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Maruti Suzuki CNG Cars Discounts
CNG Cars Discounts December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 1:53 PM IST

CNG Cars Discounts December 2023 :మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, టయోటా లాంటి టాప్​ ఆటోమొబైల్ కంపెనీలు తమ సీఎన్​జీ వాహనాలపై భారీ డిస్కౌంట్​లను ప్రకటించాయి. 2023 ఏడాది ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఇవి దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టాక్‌లను క్లియర్ చేయడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్​ ఆఫర్లను అందిస్తున్నాయి. సాధారణంగా కొత్త సంవత్సరంలో తదుపరి మోడల్ ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో ఏడాది చివరి నెలలో ప్రత్యేకమైన ఆఫర్లతో పాత స్టాక్‎ను క్లియర్​ చేసేందుకు కంపెనీలు వివిధ మోడల్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో భాగంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, టయోటా లాంటి కార్ల తయారీ కంపెనీలు తమ CNG వాహనాలను భారీ తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నాయి.

  1. Maruti Suzuki CNG Cars Discounts :మారుతి సుజుకి స్విఫ్ట్ CNG కారుపై రూ.25,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. Celerio, S-Presso లాంటి CNG వేరియంట్‌లపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్​, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్ ఇస్తున్నారు. వ్యాగన్-ఆర్​ CNG కారును రూ.25,000 నగదు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు. ఇక Baleno CNG కారుపై రూ.25,000 నగదు తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్​గా రూ.10,000 లేదా స్క్రాపేజ్ బెనిఫిట్​ కింద రూ.15,000 లభిస్తాయి. అదనంగా రూ.2000 కార్పొరేట్ డిస్కౌంట్​ లభిస్తుంది.
    మారుతి సుజుకి కార్స్​
  2. TATA CNG Cars Discounts :టాటా మోటార్స్ ఈ ఏడాది ఆల్ట్రోజ్ సీఎన్‌జీ, పంచ్ సీఎన్‌జీలతో సహా, కొత్త మోడళ్లను ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో రూపొందించింది. తాజా సేల్‎లో Altroz CNG ట్విన్‌పై రూ.25,000 వరకు డిస్కౌంట్​ను పొందవచ్చు. అంటే ఈ కారుపై రూ.10,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. టాటా టియాగో CNG ట్విన్ రూ.30,000 నగదు తగ్గింపుతో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.5,000 పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.50,000 వరకు బెనిఫిట్​ లభిస్తుంది. దీని సిబ్లింగ్ Tigor సీఎన్​జీపై కూడా ఇదే విధమైన డిస్కౌంట్స్ లభిస్తాయి.
    టాటా కార్స్​
  3. Hyundai CNG Cars Discounts :సీఎన్​జీ-స్పెక్ హ్యుందాయ్ ఆరాపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్​ చొప్పున మొత్తంగా రూ.33,000 వరకు బెనిఫిట్​ పొందవచ్చు. ఇక Grand i10 Nios CNG పై రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఏకంగా రూ.48,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
    హ్యుందాయ్ కార్స్​
  4. Toyota CNG Cars Discounts :టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ.20,000 తగ్గింపుతో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000తో పాటు, రూ.11,000 విలువైన కార్​ వారంటీ లభిస్తుంది.
    టయోటా కార్స్​

ABOUT THE AUTHOR

...view details