తెలంగాణ

telangana

ETV Bharat / business

CIBIL Score Correction Process : లోన్ స‌క్ర‌మంగా క‌ట్టినా.. సిబిల్ స్కోర్​ త‌గ్గిందా?.. సింపుల్​గా ఫిర్యాదు చేయండిలా! - credit score check free

CIBIL Score Correction Process In Telugu : నేటి కాలంలో రుణాలు మంజూరు కావాలంటే సిబిల్ స్కోర్ (క్రెడిట్ స్కోర్​) తప్పనిసరి. వాస్తవానికి సిబిల్ స్కోర్​ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కొన్ని సార్లు మనం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పటికీ.. సిబిల్ స్కోర్​ తగ్గినట్లు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఆన్​లైన్​లో ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

cibil score rectification
CIBIL Score Correction Process

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 10:50 AM IST

CIBIL Score Correction Process : మ‌న‌కు సులభంగా రుణాలు మంజూరు కావాల‌న్నా, ఈఎంఐలో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాల‌న్నా.. మంచి సిబిల్ స్కోరు తప్పనిసరి. అయితే కొన్ని సార్లు బ్యాంక్​ రుణాలను, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలను సకాలంలో చెల్లించినా.. క్రెడిట్ స్కోర్ మాత్రం తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీ క్రెడిట్​ స్కోర్​ను సరిచేయమని ఆన్​లైన్​లో ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్​లైన్​లో ఫిర్యాదు
CIBIL Correction Online : ముందుగా సిబిల్ అధికారిక వెబ్​సైట్​ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. త‌ర్వాత కంప్లైంట్​ ఫార‌మ్​ని జాగ్రత్తగా నింపాలి. అక్క‌డ అడిగిన అన్ని వివ‌రాలు స్ప‌ష్టంగా పూరించాలి. అవసరమైన పత్రాలు అన్నింటినీ అప్​లోడ్ చేయాలి. మీ వ‌ద్ద దీనికి సంబంధించి ఏవైనా స‌పోర్టింగ్ ధ్రువ‌ప‌త్రాలు ఉంటే వాటిని కూడా జ‌త చేయ‌వ‌చ్చు. ఫారమ్​ సబ్​మిట్​ చేసిన త‌ర్వాత‌.. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం కంప్ల‌ైంట్​ ఫార‌మ్ కాపీని మీ వ‌ద్ద ఉంచుకోవాలి.

సిబిల్ ద‌ర్యాప్తు
CIBIL Investigation : మీరు కంప్లైంట్​ ఫైల్ చేసిన త‌ర్వాత‌.. సిబిల్ దర్యాప్తు ప్రారంభిస్తుంది. మీకు రుణం మంజూరు చేసిన బ్యాంక్​ను.. అన్ని వివరాలు 30 రోజుల్లో అందించాలని సూచిస్తుంది. ఒక‌వేళ లోపం త‌మ వ‌ద్దే ఉందని బ్యాంక్ అంగీకరిస్తే, సిబిల్.. మీ క్రెడిట్​ స్కోర్​ను సరిదిద్దుతుంది. ముఖ్యంగా మీ క్రెడిట్ రిపోర్టులను స‌వ‌రించి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేస్తుంది. త‌ర్వాత స‌వ‌రించిన క్రెడిట్ నివేదిక‌ను మీకు పంపిస్తుంది.

సిబిల్​ స్కోర్​ సరిదిద్దకపోతే..
ఒక‌వేళ రుణదాత మీ వాదనతో ఏకీభవించనట్లయితే.. మీ క్రెడిట్ నివేదిక, క్రెడిట్ స్కోర్‌లోని వివరాలు అలాగే ఉంటాయి. అలాంట‌ప్పుడు మీరు నేరుగా మీ బ్యాంక్ లేదా రుణదాతతో సంప్రదించి, సకాలంలో మీరు చెల్లించిన రుణాల‌ను సంబంధించిన రుజువులను, పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఇలా చేసిన 30 రోజుల‌లోపు మీకు బ్యాంక్​ నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న రాకుంటే.. దీనిపై మ‌ళ్లీ మీరు సిబిల్​కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

రాత్రికి రాత్రే అంతా జరిగిపోదు!
ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. క్రెడిట్ స్కోర్ అనేది రాత్రికి రాత్రే మార‌దు. మీ వివాదం ప‌రిష్కారం అయిన అనంత‌రం అందులో మార్పులు చేసిన తర్వాత.. మారిన స్కోరు క‌నిపించ‌డానికి కొంత సమయం పడుతుంది. అందుకే క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యం దృష్ట్యా.. ఇలాంటి వివాదాల‌ను విస్మ‌రించ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్క‌రించుకోవ‌డం అవసరం. క్రెడిట్ స్కోరు బాగా తక్కువగా ఉంటే.. భ‌విష్య‌త్తులో మీరు రుణాల‌ను పొంద‌డం క‌ష్ట‌మ‌వుతుంది. హై క్రెడిట్ స్కోరు అనేది మీ రుణార్హతను, అప్పు తీర్చే సామర్థ్యాన్ని పెంచుతుంది. కనుక బ్యాంకులు నుంచి లోన్ తీసుకుని, స‌క్ర‌మంగా చెల్లింపులు చేస్తున్నా.. సిబిల్ స్కోర్​పై ఓ క‌న్నేసి ఉంచ‌డం ఉత్త‌మం.

ABOUT THE AUTHOR

...view details