GST Rationalisation: జీఎస్టీలో స్లాబ్ రేట్లను పెంచుతారనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్ రేటును ఎనిమిది శాతానికి పెంచుతారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం 5,12, 18, 28 స్లాబ్ రేట్లు ఉన్నాయి. ఐదు శాతం స్లాబులో ఉన్న కొన్ని ఆహారేతర వస్తువులను మూడు శాతం స్లాబులోకి మార్చి.. మిగిలిన వస్తువులను కొత్తగా ఏర్పాటు చేసే ఎనిమిది శాతం స్లాబులోకి తెస్తారని వార్తలు వచ్చాయి.
GST Rationalisation: జీఎస్టీ రేటు పెంచడం లేదు: కేంద్రం - gst rate rationalisation
GST Rationalisation: జీఎస్టీ స్లాబ్ రేట్ల మార్పు వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రేట్ల హేతుబద్దీకరణ కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని తెలిపాయి.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని గతంలోనే ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వం వహించగా.. బంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇప్పటివరకు నివేదికే సమర్పించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జీఎస్టీ ఛైర్మన్గా ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లారని.. అందువల్లే తదుపరి జీఎస్టీ మండలి సమావేశం ఎప్పుడనేది కూడా ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి.
ఇదీ చదవండి:10 నిమిషాల్లో డెలివరీపై మాటమార్చిన ఆనంద్ మహీంద్రా