Central Govt Plans GST on Credit Card Cashbacks ! : గతంలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు బ్యాంకులే వెంటపడి మరీ కార్డులు ఇచ్చేస్తున్నాయి. మెరుగైనక్రెడిట్ స్కోర్(Credit Score)ఉంటే చాలా సులువుగా ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. దాంతో ప్రస్తుతం తగిన సంపాదన ఉండి బ్యాంకు అకౌంట్ ఉన్న చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే.. క్రెడిట్ కార్డు వాడడం వల్ల రివార్డు పాయింట్లు వస్తుంటాయి. క్యాష్ బ్యాక్స్ కూడా వస్తుంటాయి. మరి, వీటిపై ఆదాయపు పన్ను ఉంటుందా? జీఎస్టీ వర్తిస్తుందా? అనే డౌట్ చాలామందికి వ్యక్తమవుతోంది. మరి, వాటిపై పన్ను విధిస్తారా లేదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Tax on Credit Card Reward Points :చాలా ఫైనాన్స్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగంపై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు, కొనుగోళ్లపై తక్షణ తగ్గింపులు, ఉచిత మెంబర్‌షిప్స్, సినిమా టికెట్లపై తగ్గింపులు లాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే.. క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా పొందే ఈ ప్రయోజనాలపై, రివార్డులపై పన్ను విధిస్తారనే విషయాన్ని యూజర్లు గమనించాలి. ఎందుకంటే వాటిని ఇన్‌కం ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద వర్గీకరిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
ఎవరైనా క్రెడిట్ కార్డు హోల్డర్ ఒక ఆర్థిక సంవత్సరంలో తాను పొందిన మొత్తంక్యాష్బ్యాక్(Credit Card Cashbacks)రూ.50,000 దాటి ఉంటే అది పన్ను పరిధిలోకి వస్తుందని ఇన్‌కం ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు కంపెనీలు రివార్డ్‌లు లేదా 5వేల రూపాయల కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్‌లపై 10 శాతం చొప్పున TDSని మినహాయించుకుంటాయి. అదే విధంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రివార్డ్‌లపై పన్ను బాధ్యతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.