Petrol Excise Duty: దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్, డీజిల్, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.
దేశప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు - Domestic cylinder price
18:54 May 21
దేశప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పెట్రోల్, వంటగ్యాస్ ధరలు
వంటగ్యాస్‌పై రాయితీ: పేదలుగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం రూ. 200 సబ్సిడీని ప్రకటించింది. దీని ద్వారా 9 కోట్ల మంది పథకం లబ్దిదారులకు మేలు జరగనుంది. చమురు ధరల తగ్గింపుతో ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యాస్ రాయితీ వల్ల రూ.6100 కోట్లు ఆదాయం తగ్గనుందని వివరించారు.
నిర్మాణ రంగానికి ఊరట:ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణాలు భారంగా మారిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఆయా రంగాలకు సంబంధించిన పలు వస్తువులపై కేంద్రం సుంకాలను తగ్గించింది. ఉక్కు, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకంలో కోత వేసింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై సుంకాన్ని తగ్గించింది.
ప్రధాని మోదీ స్పందన:పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'మాకు ప్రజలే తొలి ప్రాధాన్యం. ఈరోజు తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. పలు రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. దేశ ప్రజలకు ఊరట కలిగిస్తుంది. సులభతర జీవనాన్ని మరింత మెరుగుపరుస్తుంది' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఎన్‌ఎస్‌ఈ కేసు'లో దర్యాప్తు ముమ్మరం.. బ్రోకర్లపై సీబీఐ దాడులు