తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త ఏడాదిలో కార్లపై భారీ డిస్కౌంట్స్ - ఏ మోడల్​పై ఎంతంటే?

Car Discounts 2024 In Telugu : మీరు ఈ నూతన సంవత్సరంలో కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ కావాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మారుతి సుజుకి, టాటా, హ్యుందాయ్, హోండా లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ బ్రాండెడ్ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Car Offers 2024
Car Discounts 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 1:16 PM IST

Car Discounts 2024 : నూతన సంవత్సరంలో ప్రముఖ ఆటోమొబైల్కంపెనీలు అన్నీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. వీటిలో మారుతి సుజుకి, టాటా, హోండా, హ్యుందాయ్​ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరి అవి ఏయే మోడళ్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నాయో చూద్దామా?

Maruti Suzuki Car Discounts 2024 : భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2024లో తమ కారు మోడల్స్​పై మంచి డిస్కౌంట్స్ ప్రకటించింది. ఏ మోడల్​పై ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారంటే?

  1. మారుతి ఇగ్నిస్​​ కారుపై గరిష్ఠంగా రూ.44,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
  2. మారుతి బాలెనో కారుపై గరిష్ఠంగా రూ.27,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
  3. మారుతి ఫ్రాంక్స్ కారుపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు.
  4. మారుతి సియాజ్​ కారును గరిష్ఠంగా రూ.28,000 డిస్కౌంట్​తో ఇస్తున్నారు.
  5. మారుతి గ్రాండ్ విటారా కారును గరిష్ఠంగా రూ.20,000 డిస్కౌంట్​తో అందిస్తున్నారు.
  6. మారుతి జిమ్నీ కారుపై రూ.5,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

Tata Car Discounts 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా 2024లో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. టాటా టియాగో కార్లపై రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్​​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ అందిస్తున్నారు.
  2. టాటా టిగోర్​ పెట్రోల్​ వేరియంట్​పై రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్​​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తున్నారు.
  3. టాటా టిగోర్​ సీఎన్​జీ వేరియంట్​పై రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్​​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ అందిస్తున్నారు.
  4. టాటా ఆల్ట్రోజ్​ కారుపై రూ.10 వేలు క్యాష్ డిస్కౌంట్​​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తున్నారు.
  5. టాటా పంచ్, నెక్సాన్​, హారియర్​, సఫారీ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్లు అందించడం లేదు.

Hyundai Car Discounts 2024 : హ్యుందాయ్ కంపెనీ కూడా ఈ నూతన సంవత్సరంలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.

  1. హ్యుందాయ్​ గ్రాండ్ ఐ10 నియోస్​ పెట్రోల్ వేరియంట్​పై రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తోంది.
  2. హ్యుందాయ్​ గ్రాండ్ ఐ10 నియోస్​ సీఎన్​జీ వేరియంట్​పై రూ.20 వేలు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ అందిస్తోంది.
  3. హ్యుందాయ్​ ఆరా​ పెట్రోల్ వేరియంట్​పై రూ.5 వేలు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తోంది.
  4. హ్యుందాయ్​ ఆరా సీఎన్​జీ వేరియంట్​పై రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్​, రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ అందిస్తోంది.
  5. హ్యుందాయ్​ ఐ20 కారుపై రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే ఇస్తున్నారు.​
  6. హ్యుందాయ్​ వెర్నా కారుపై రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్​, రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తోంది.
  7. హ్యుందాయ్​ అల్కాజర్​ కారుపై రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే అందిస్తున్నారు.
  8. హ్యుందాయ్​ టక్సన్​​ కారుపై రూ.50 వేలు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  9. హ్యుందాయ్​ ఎక్స్​టర్​, వెన్యూ కార్లపై ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం లేదు.

Honda Car Discounts 2024 : హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్లోని తమ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  1. హోండా అమేజ్​ కారుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్​ + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్​ + కార్పొరేడ్ & లోయల్టీ డిస్కౌంట్ ఇస్తున్నారు.
  2. హోండా సిటీ​ కారుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్​ + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్​ + కార్పొరేడ్ & లోయల్టీ డిస్కౌంట్ + 5 ఏళ్ల వారెంటీ ప్యాకేజ్​ అందిస్తున్నారు.
  3. హోండా సిటీ eHEV హైబ్రిడ్ కారుపై గతేడాది రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇచ్చారు. కానీ నేడు దీనిపై ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్లు అందించడం లేదు.

డిజిటల్​ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ టాప్​-8 టిప్స్​ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details