Can I Get Gratuity Before 5 Years :గ్రాట్యుటీ.. ఒకే సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా పనిచేసి.. అనంతరం అక్కడ ఉద్యోగం మానేసి వెళుతున్న వారికి సదరు కంపెనీ ఇచ్చే మొత్తం. అయితే ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఐదేళ్ల పాటు పనిచేసిన వారే అర్హులా? అంతకంటే తక్కువ పనిచేసిన వారు ఈ గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోలేరా? ఈ విషయంలో అటు సంస్థ యాజమాన్యం.. ఇటు ఉద్యోగి కాస్త గందరగోళంలో ఉంటారు. మరి గ్రాట్యుటీ చట్టం 1972 దీనిపై ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Gratuity Eligibility Period in India :గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం.. నిరంతరాయంగా ఒకే సంస్థలో ఐదేళ్ల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగి కూడా ఈ మొత్తాన్ని పొందొచ్చు. 4 సంవత్సరాల 8 నెలల పాటు లేదంటే అంతకంటే తక్కువ పనిచేసిన ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ తీసుకునేందుకు అర్హులు. ఇన్ని రోజులు పాటు సంస్థకు సేవలందించిన ఉద్యోగికి.. గ్రాట్యుటీఇచ్చి గౌరవించాలని చట్టంలోని ఓ నిబంధన సూచిస్తోంది. ముంబయికి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది కూడా ఇదే విషయాన్ని తెలిపారు. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 4(2) ప్రకారం.. ఉద్యోగి ఒకే సంస్థలో 4 సంవత్సరాల 6 నెలల పాటు నిరంతరాయంగా పనిచేస్తే.. వారు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.