తెలంగాణ

telangana

ETV Bharat / business

BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం - bsnl cabinet package

నష్టాల ఊబిలో ఉన్న బీఎస్ఎన్​ఎల్​ను ఆదుకునేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సంస్థ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 4జీ సేవల విస్తరణ కోసం స్పెక్ట్రమ్ కేటాయించనున్నట్లు తెలిపింది. మరోవైపు, రెండోరోజు 5జీ వేలంలో రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.

BSNL revival package
BSNL revival package

By

Published : Jul 27, 2022, 5:10 PM IST

Updated : Jul 27, 2022, 5:24 PM IST

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు పునరుజ్జీవం పోసేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. రూ.33వేల కోట్ల స్టాట్యుటరీ బకాయిలను ఈక్విటీగా మలచనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.33 వేల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు సార్వభౌమ బాండ్లను బీఎస్ఎన్ఎల్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

సేవలను మెరుగుపర్చడం, బ్యాలెన్స్ షీట్​పై భారాన్ని తగ్గించడం, ఫైబర్ నెట్​వర్క్​ను విస్తృతం చేయడం అనే మూడు అంశాలు ప్యాకేజీలో భాగమని మంత్రి వివరించారు. 4జీ సర్వీసులను వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వమే స్పెక్ట్రమ్​ను కేటాయించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు, భారత్ బ్రాడ్​బ్యాండ్ నెట్​వర్క్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్​లో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు.

జోరుగా 5జీ వేలం..
మరోవైపు, 5జీ వేలం ప్రక్రియ జోరుగా సాగుతోంది రెండో రోజు రూ.1.49 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం తొమ్మిదో విడత వేలం కొనసాగుతోందని చెప్పారు. మంగళవారం నిర్వహించిన నాలుగు రౌండ్ల తర్వాత రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jul 27, 2022, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details