BYJUs Lay Off : దేశంలోని అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ బైజూస్ ఈ ఏడాది దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అర్జున వ్యూహం!
Byjus New CEO Arjun Mohan :ఇటీవలే అర్జున్ మోహన్ బైజూస్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే సంస్థ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది దాదాపు 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వ్యయాలను అదుపు చేయడానికే!
Byjus Employee Layoffs : కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో బైజూస్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. అప్పట్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌కు మంచి ఆదరణ ఉండడం వల్ల ఇది కంపెనీకి లాభసాటిగానే ఉండింది. కానీ కొవిడ్ సమస్య తెరమరుగు అయ్యాక సంస్థ లాభాలు బాగా క్షీణించాయి. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. దీనితో సంస్థపై తీవ్రమైన ఆర్థికభారం పడింది. ఈ నేపథ్యంలోనే బైజూస్ కంపెనీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. అందులో భాగంగా సాధారణ ఉద్యోగులతోపాటు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సైతం తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా బహుశా ఈ వారంలోనే జరిగే అవకాశం ఉన్నట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం.
కొత్త టీమ్స్ ఏర్పాటు!
ప్రస్తుతం బైజూస్‌లో ఉన్న చాలా విభాగాలను విలీనం చేసి సరికొత్త టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు అర్హున్ మోహన్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు విభాగాల్లోనూ ఒకే స్టాఫ్‌ను ఉపయోగించుకోనున్నారు. అదనంగా ఉన్న ఉద్యోగులను బయటకు పంపనున్నారు.