Kalyan Jewellers MD Business Net worth : భారతదేశంలో బంగారానికి ఉండే డిమాండ్ ఎంతో ఎక్కువ. మన దేశంలో ఏ చిన్న శుభకార్యానికైనా బంగారం దుకాణాలకు జనాలు బారులు కడుతుంటారు. బంగారాన్ని ఇక్కడ హోదాను చూపించుకోవడానికి మాత్రమే కాకుండా ఆస్తిగా, భరోసాగా భావిస్తారు. అలాంటి బంగారాన్ని అమ్మే దుకాణదారులు కూడా భారతదేశంలో లెక్కలేనంత మంది ఉన్నారు. దేశంలో బంగారం వ్యాపారం అంతకంతకు విస్తరిస్తుండగా.. కొంతమంది బంగారు వ్యాపారవేత్తలు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఇలా ప్రత్యేక గుర్తింపు సాధించిన బంగారు వ్యాపార సంస్థల్లో కల్యాణ్ జువెలర్స్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కల్యాణ్ జువెలర్స్‌కు స్టోర్స్ ఉన్నాయి.
వాస్తవానికి భారతదేశంలో అగ్రగామి బంగారు విక్రయ సంస్థల్లో కల్యాణ్ జువెలర్స్ ఒకటి. వాస్తవానికి ఈ కల్యాణ్ జువెలర్స్ పేరు వినని పసిడి ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయనే టీ.ఎస్. కల్యాణరామన్.
చిరుప్రాయంలోనే!
T S Kalyanaraman Business : 12 ఏళ్ల చిరుప్రాయంలోనే బంగారం వ్యాపారంలో ప్రవేశించిన కల్యాణరామన్.. అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. దశాబ్దాలపాటు కల్యాణ్ జువెలర్స్‌ను విజయపథంలో నడిపించిన ఆయన.. నేడు దానిని 1.35 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.