తమ ప్రభుత్వం మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుందన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. నవభారతం సాకారం, ఆర్థిక అభివృద్ధి, సమాజ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
తొలి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.. రెండోదిగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.. తృతీయ ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం అనే ప్రధాన లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మోదీ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు.
"భారత్ ప్రస్తుతం అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014-19 మధ్య 190 బిలియన్ డాలర్ల నుంచి 284 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2019 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు 52. 2 నుంచి 48.7 శాతానికి తగ్గించాం. ఈ బడ్జెట్ మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది నవభారత నిర్మాణం.. ఇందులో అందరికీ మెరుగైన జీవన సౌకర్యాలు, ఆరోగ్యం, మంచి ఉద్యోగాల కల్పన కల్పించేందుకు లక్ష్యించాం. రెండోది ఆర్థిక అభివృద్ధి.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ప్రధాని నినాదంతో ఆర్థిక సంస్కరణలు చేపడతాం. ఇందులో భాగంగా అధిక ఉత్పాదకత, నైపుణ్యతను సాధించేందుకు కృషి చేయనున్నాం. మూడోది సంక్షేమ రాజ్యం.. మానవత, కారుణ్యం లక్షాలుగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసి అందరి విశ్వాసం చూరగొంటాం."
-నిర్మల సీతారామన్, ఆర్థికమంత్రి
ఇదీచూడండి: పద్దు 2020 : బడ్జెట్ లైవ్ అప్డేట్స్