BSNL Plans To Launch 4G Service :బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ఈ డిసెంబర్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ పీకే పూర్వార్ వెల్లడించారు. పంజాబ్‌లో మొదట ఈ సేవలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. క్రమంగా ఈ సేవలు దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పీకే పూర్వార్ ఈ అంశాన్ని వెల్లడించారు.
4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పుర్వార్ తెలిపారు. ఆ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో తొలి దశలో కొన్ని చోట్ల ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. 2024 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పుర్వార్ వెల్లడించారు. 4జీ విస్తరణ పూర్తయ్యాక 5జీ సర్వీసులు కూడా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌కు అప్పగించింది. కొద్ది రోజుల క్రితమే ఈ డీల్ కుదిరింది. 5జీ సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన స్పెక్ట్రమ్ కూడా తమ వద్ద అందుబాటులో ఉందని పీకే పూర్వార్ తెలిపారు.
ఏ రంగాల వారికి ముందుగా 5జీ సేవలు :
ఎయిర్టెల్ వన్‌వెబ్ సాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్..
దేశ వ్యాప్తంగా వన్‌వెబ్ సాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. నవంబర్ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు ఆ సంస్థ ఛైర్మన్ సునీల్ మిత్తల్. దేశంలో ఎక్కడి నుంచి అయిన ఈ సేవలను పొందొచ్చని ఆయన తెలిపారు.
జియోస్పేస్‌ఫైబర్‌తో.. ఇకపై దేశంలో జెట్ స్పీడ్‌తో 5జీ సేవలు!
Reliance Jio Unveils JioSpaceFiber :రిలయన్స్ జియో కూడా తాజాగా జియోస్పేస్‌ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఈ శాటిలైట్ నెట్వర్క్ ఆధారిత సర్వీస్‌తో.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించడానికి రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుసాయం లేని ప్రాంతాలకు కూడా.. దీని ద్వారా వేగవంతమైన బ్రాండ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లోనే ఈ విషయాన్ని వెల్లడించింది జియో.
ఫ్రీగా అన్లిమిటెడ్ 5జీ డేటా.. ఆ యూజర్లకు మాత్రమే.. కండీషన్స్ అప్లై!
How to get Airtel Data loan : మీకు ఈ విషయం తెలుసా? ఎమర్జెన్సీ సమయంలో అదనపు డేటా పొందవచ్చు.!