తెలంగాణ

telangana

BSA Gold Star 650 Vs Royal Enfield Interceptor 650 : BSA గోల్డ్ స్టార్ Vs రాయల్ ఎన్​ఫీల్డ్.. ఫీచర్స్​, ధర, ఇంకా ఎన్నో..

BSA Gold Star 650 Vs Royal Enfield Interceptor 650 : ద్విచక్ర వాహనాల్లో రారాజుగా వెలుగొందుతున్న రాయల్​ ఎన్​ఫీల్డ్​కి పోటీగా మరో బైక్ రాబోతోంది. ఇప్పటికే.. రాయల్​ ఎన్​ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ మార్కెట్​లోకి వచ్చింది. దీనికి పోటీగా త్వరలో బ్రిటీష్ కంపెనీ BSA నుంచి గోల్డ్ స్టార్ రానుంది. ఈ రెండింటి ఫీచర్స్, ధర వంటి వివరాలు చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:05 PM IST

Published : Oct 14, 2023, 4:05 PM IST

Royal Enfield Interceptor 650
BSA Gold Star 650 Vs Royal Enfield Interceptor 650

BSA Gold Star 650 Vs Royal Enfield Interceptor 650 : మోటార్ సైకిళ్ల తయారీ రంగంలో ప్రత్యేక ఒరవడిని సృష్టించి.. తనదైన బ్రాండ్ సెట్ చేస్కున్నది రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​. ద్విచక్ర వాహనాల్లో ఎన్ని బ్రాండ్స్, మోడల్స్ ఉన్నా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​లో ఉండే రాజసమే వేరు అంటారు ఈ బైక్ ఫ్యాన్స్. దాని ప్రత్యేకమైన ఆహార్యం నుంచి అది చేసే శబ్ధం, దూసుకెళ్లే వేగం.. అన్నీ తనకు మాత్రమే సొంతం అనేలా ఉంటాయి. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్​కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కొద్ది నెలల క్రితమే.. Royal Enfield Interceptor 650 మార్కెట్​లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి పోటీగా త్వరలో భారత మార్కెట్​లోకి బ్రిటీష్ కంపెనీ బీఎస్​ఏ సిద్ధమవుతోంది. ఈ కంపెనీ తన నయా బైక్​ "BSA Gold Star 650"తో రాయల్​ ఎన్​ఫీల్డ్(Royal Enfield)​కు పోటీగా వస్తోంది. ఇంతకీ ఏ రెండింటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి..? దేని ధర ఎంత? అన్న వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బీఎస్​ఏ 650 స్పెసిఫికేషన్స్ (BSA Gold Star 650 Specifications) :

  • బ్రిటీష్ కంపెనీ బీఎస్​ఏ తీసుకొస్తున్న BSA Gold Star 650 బైక్​లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి.
  • ఈ బైక్​ లిక్విడ్ కూల్డ్​, సింగిల్-సిలిండర్, 652cc ఇంజిన్‌తో వస్తుంది.
  • ఇది 6000ఆర్​పీఎం వద్ద 45.6 Ps, అలాగే 4000ఆర్​పీఎం వద్ద 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
  • ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
  • BSA కొత్త ఇంజిన్ 1800 rpm కంటే తక్కువ నుంచి టార్క్‌ను పెంచడం ప్రారంభిస్తుంది.
  • తరచుగా గేర్‌ను మార్చకుండా ఉండటానికి సహాయపడుతుంది.
  • BSA గోల్డ్​ స్టార్ 650లో బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 320mm, వెనుక 255mm డిస్క్​ను అమర్చారు.
  • ఈ బైక్​లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.
  • అలాగే DOHC, 4 valves per cylinder, twin spark plugs ఉన్నాయి.
  • ఈ బైకు సుమారు 213 కిలోల బరువు ఉంటుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్‌సెప్టర్ 650 స్పెసిఫికేషన్స్ (Royal Enfield Interceptor 650 Specifications) :

  • రాయల్​ ఎన్​ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది.
  • ఇంటర్‌సెప్టర్ 650 ట్విన్-సిలిండర్ కలిగి 648 cc ఇంజిన్‌తో వస్తోంది.
  • ఇది 7150 rpm వద్ద 47.65 Ps, 5250 rpm వద్ద 52 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.
  • ట్రాన్స్‌మిషన్ విధులు స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
  • అలాగే Parallel twin, 4-స్ట్రోక్, సింగిల్ ఓవర్‌హెడ్ క్యామ్, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌లను కలిగి ఉంది.
  • ముందు భాగంలో 320 mm డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 240 mm డిస్క్ బ్రేక్‌లు అమర్చారు.
  • డ్యూయల్-ఛానల్ ABS ద్వారా అవి పనిచేస్తాయి.
  • ఈ బైక్​ను 202 కేజీల బరువుతో రూపొందించారు.

KTM Duke New Model 2023 : అదిరే ఫీచర్స్​తో నయా కేటీఎం డ్యూక్​ బైక్స్ ​.. ధర ఎంతంటే?

BSA గోల్డ్ స్టార్ 650 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధర : BSA.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంటే ప్రీమియం బ్రాండ్‌గా స్లాట్ చేయబడింది. దీనిని బట్టి చూస్తే.. గోల్డ్ స్టార్ 650 భారతదేశంలో రూ. 5 లక్షల నుంచి ధర మొదలవ్వొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. అదే రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 2.81 లక్షల నుంచి 3.03 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ రంగును బట్టి ధర మారుతూ ఉంటుంది.

Bikes Launched In October 2023 : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. సూపర్ బైక్స్ లాంఛ్​.. ధర ఎంతంటే?

Hero Scooter New Model 2023 : హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్​ లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details