Bonus To Caratlane Startup Employees : టైటాన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రముఖ జ్యువెలరీ స్టార్టప్ సంస్థ క్యారెట్‌లేన్ ఉద్యోగులు భారీ మొత్తంలో బోనస్‌ను అందుకోనున్నారు. కంపెనీలోని ఉద్యోగుల్లో మొత్తం 75 మంది ఒక్కొక్కరు రూ.340-380 కోట్ల చొప్పున టైటాన్ నుంచి బోనస్ కింద ఈ భారీ మొత్తాన్ని దక్కించుకోనున్నారు. ESOP (ఎంప్లాయ్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్) పేఅవుట్ పద్ధతి కింద క్యారెట్‌లేన్ ఉద్యోగులకు ఈ జాక్‌పాట్ దక్కింది. కాగా, క్యారెట్లేన్లోని వాటాను కొనుగోలు చేసేందుకు టైటాన్ ఇప్పటికే ఒప్పందం ( Titan Caratlane Deals ) కుదుర్చుకుంది. ఈ డీల్ రెగ్యులేటరీ అనుమతుల మేరకు 2023 అక్టోబర్ 31తో పూర్తికానుంది.
వాటిని కూడా త్వరలోనే..
Jackpot To Caratlane Jewellery :క్యారెట్‌లేన్ సంస్థలో సుమారు 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో అధిక శాతం రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పనిచేస్తున్నవారే. అయితే వీరికి సంస్థలో ఎటువంటి వాటాలు లేవు. అయినప్పటికీ వీరిలోని కొంతమందికి భారీ స్థాయిలో బోనస్, హైక్‌లను ప్రకటించింది టైటాన్. ఈ 1500 మందిలో దాదాపు 400 మంది ఉద్యోగులు ఈ స్టార్టప్‌లోని కార్పొరేట్ బృందంలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. వీరిలోని 75 మందికి తాజాగా రూ.340-రూ.380 కోట్ల మేర బోనస్‌ను ప్రకటించారు. దీంతో వీరంతా కంపెనీలో 1.72 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లయింది. అయితే వీటిని కూడా టైటాన్ త్వరలోనే కొనుగోలు చేయనుంది. అయితే వీటిని ఈఎస్ఓపీ( ESOP Benefits For Caratlane) పద్ధతి ద్వారానే సొంతం చేసుకోగలదు.
వంద శాతం లక్ష్యంగా..
Titan Acquires Caratlane :టైటాన్‌కు క్యారెట్‌లేన్‌లో ప్రస్తుతం 71.09 శాతం వాటా ఉంది. మిగిలిన 27.18 శాతం వాటాను కూడా రూ.4,621 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. టైటాన్.. తాజాగా క్యారెట్‌లేన్ ఉద్యోగులకు లభించిన బోనస్ స్టాక్లను కూడా త్వరలోనే సొంతం చేసుకోనుంది. మొత్తం మీద స్టార్టప్‌లో వంద శాతం వాటాను సొంతం చేసుకోవాలని టైటాన్ సంస్థ భావిస్తోంది. కాగా, షాచెట్టి ఫ్యామిలీ నుంచి 27.18 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ ఆభరణాల స్టార్టప్‌లో ప్రస్తుతం 98.28 శాతం మేర యాజమాన్య హక్కులను కలిగి ఉంది టైటాన్.