ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తును డిపాజిట్ చేయాలని చందా కొచ్చర్ దంపతులను కోర్టు ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసులో వీరి అరెస్ట్ చట్టం ప్రకారం జరగలేదని అని కోర్టు పేర్కొంది. అలాగే పాస్‌పోర్టులను సీబీఐకి అప్పగించాలని చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను ఆదేశించింది.
తమను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్, ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్ట్ విచారణ చేపట్టింది. సీబీఐ తమను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందని పిటిషన్లలో వారిద్దరు పేర్కొన్నారు.
ICICI బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు బాంబే హైకోర్ట్ బెయిల్ - చందా కొచ్చర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తులో వీరిద్దరిని విడుదల చేసింది.
అంతకుముందు, వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. వీరిద్దరినీ గతేడాది డిసెంబరు 23న అదుపులోకి తీసుకుంది. 2018లో వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ వైదొలిగారు.
ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో చందా కొచ్చర్ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్, న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.