తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్‌టెల్‌ అదుర్స్.. లాభం ఐదింతలు - ఎయిర్​టెల్ న్యూస్​

Airtel Q1 results: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదింతల లాభాన్ని ఆర్జించింది ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌. కంపెనీ ఆదాయం సైతం 24 శాతం పెరిగింది. గతేడాది రూ.283.5 కోట్ల నికర లాభాన్ని గడించగా.. ఈ ఏడాది రూ.1607 కోట్లు సాధించింది.

Airtel Q1 results
Airtel Q1 results

By

Published : Aug 9, 2022, 5:34 AM IST

Airtel Q1 results: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదింతల లాభాన్ని ఆర్జించింది. గతేడాది రూ.283.5 కోట్ల నికర లాభాన్ని గడించగా.. ఈ ఏడాది రూ.1607 కోట్లు సాధించింది. కంపెనీ ఆదాయం సైతం 24 శాతం పెరిగింది. గతేడాది రూ.18,828.4 కోట్లుగా ఉన్న ఆదాయం ప్రస్తుత ఏడాది రూ.23,319 కోట్లకు పెరిగింది.

ఒక్క మొబైల్‌ సేవల ఆదాయం 27 శాతం వృద్ధి చెందింది. గతేడాది రూ.14305.6 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.18,220 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.146గా ఉన్న వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం ఈ ఏడాది రూ.183కి పెరిగింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడం, టారిఫ్‌ల సవరణ వల్ల సగటు ఆదాయం పెరగడం వంటివి ఎయిర్‌టెల్‌ భారీ లాభాలకు దోహదం చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో సోమవారం కంపెనీ షేరు 0.18 శాతం లాభంతో రూ.704.95 వద్ద ముగిసింది.

ABOUT THE AUTHOR

...view details