How to Save Income Tax in Telugu : దేశంలో నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం కలిగిన వారంతా ప్రతి ఏటా ప్రభుత్వానికి తప్పకుండా ఆదాయ పన్ను చెల్లించాలి. ఆ పన్ను వ్యక్తిగతమైనా లేదా కార్పొరేట్ ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయపన్ను చట్టం 1961లో పన్ను మినహాయింపులకు సంబంధించి కొన్ని మార్గాలు ఉన్నాయి. చాలా మందికి ఈ ట్యాక్స్(Income Tax) సేవింగ్ పద్ధతులపై సరైన అవగాహన ఉండదు. ఈ క్రమంలో వారు కొంతమేర నష్టపోతుంటారు. అలాంటి వారి కోసం చట్టబద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద పన్ను మినహాయింపు పొందే కొన్ని ట్యాక్స్ పే మార్గాలు తీసుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఈ సెక్షన్స్ కింద పన్ను మినహాయింపు :ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొన్ని మినహాయింపులు ఇస్తోంది. అందులో సెక్షన్ 80C.. ఓ ప్రత్యేకమైన దానిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా నిర్దిష్ట పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ సెక్షన్‌తో పాటు 80సీసీసీ, 80సీసీడీ కింద ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఈ సెక్షన్స్ ద్వారా కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ట్యాక్స్ పే చేసేవారు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందే ఛాన్స్ ఉంది.
గృహ రుణాలు :ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద పన్ను చెల్లింపుదారులు హౌమ్ లోన్స్‌పై మినహాయింపు పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పే చేసేవారు ఇంటి రుణాలపై రూ. 2 లక్షల వరకు పన్ను తగ్గింపు పొందే మార్గాలున్నాయి.
ఎడ్యుకేషన్ లోన్ :ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80E కింద పన్ను చెల్లింపుదారులు విద్యా రుణంపై తగ్గింపు పొందొచ్చు. అయితే దీనికి సంబంధించి గరిష్ఠంగా ఇంత వరకు పన్ను మినహాయింపు అనేది ఏమీ లేదు.
మెడికల్ వ్యయాలు : ఐటీ శాఖ.. సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపులను అందిస్తోంది. దీని ప్రకారం మంత్లీ ఇన్కమ్ పొందే ఉద్యోగులు మెడికల్ ఇన్సూరెన్స్‌లపై రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను చెల్లింపు దారుడు తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, సీనియర్ సిటిజన్లపై చేసే మెడికల్ వ్యయాలపై పన్ను మినహాయింపు పొందే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోంది.