Best Two Wheelers For Ladies In India 2023 :కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు రద్దీ బస్సుల్లో, ఆటోల్లో వెళ్లడం కంటే.. స్కూటీల్లో వెళ్లడమే చాలా వరకు సేఫ్. అందుకే చాలా మంది రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని ఆశపడుతూ ఉంటారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. పైగా అదిరిపోయే ఫీచర్లతో, స్టైలిష్ లుక్స్‌తో వాటిని అందిస్తున్నాయి. వాటిలోని టాప్-5 స్కూటీలపై ఓ లుక్కేద్దాం.
1. Honda Activa 6G Features : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ కాలేజ్ అమ్మాయిలకు చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. దీనిలోని ఫీచర్లు..
- ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ సస్పెన్షన్
- ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ లిడ్
- 12 అంగుళాల ఫ్రంట్ వీల్
- 10 అంగుళాల రియర్ వీల్
- ఫ్యూయెల్ ఇంజెక్షన్ (FI)
- ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్
- 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్
- ఎల్ఈడీ హెడ్ ల్యాంప్
Honda Activa 6G Specifications :ఈ స్కూటీలో 109.51cc ఇంజిన్ ఉంది. ఇది 8000 rpm వద్ద 7.68 PS పవర్, 5250 rpm వద్ద 8.79 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ హోండా యాక్టివా స్కూటీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.
Honda Activa 6G Mileage : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Honda Activa 6G Price :
- హోండా యాక్టివా 6జీ STD ధర రూ.63,912
- హోండా యాక్టివా 6జీ DLX ధర రూ.65,412
2. Yamaha Fascino 125 BS6 FI Features : ఈ యమహా స్కూటీ చూడడానికి సూపర్ స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. మహిళలు రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలోని ఫీచర్లు..
- స్టాప్ / స్టార్ట్ సిస్టమ్
- టెలిస్కోపిక్ సస్పెన్షన్
- ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విత్ యూబీఎస్
- 21 లీటర్ అండర్ సీట్-స్టోరేజ్
- సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ స్విఛ్
Yamaha Fascino 125 FI Specifications :ఈ స్కూటీలో 125సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీలోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు.
Yamaha Fascino 125 FI Mileage :ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ స్కూటీ ఒక లీటర్‌కు 58 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Yamaha Fascino 125 FI Price :
- యమహా ఫాసినో డిస్క్ ధర రూ.68,930 ఉంటుంది.
- యమహా ఫాసినో డ్రమ్ ధర రూ.66,430 ఉంటుంది.
3. Suzuki Access 125 BS6 Features : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్కూటీ - సుజుకి యాక్సెస్. దీనిలోని ఫీచర్లు..
- ఎకో అసిస్ట్ ఇల్యుమినేషన్
- ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్
- ఎక్స్టర్నల్ ఫ్యూయెల్ ఫిల్
- డ్యూయెల్ లగేజ్ హుక్స్
- అల్లాయ్ వీల్స్
- యూఎస్బీ మొబైల్ ఛార్జర్
- టెలిస్కోపిక్ సస్పెన్షన్
- కబ్బీ హోల్ ఫర్ మొబైల్ ఫోన్
Suzuki Access 125 Specs : ఈ సుజుకి యాక్సెస్ స్కూటీలో 125సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6750 rpm వద్ద 8.6 PS పవర్, 5500 rpm వద్ద 10Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్.