Best Tips for Car Audio System Maintenance : చాలా మంది కారు ఇంజిన్, బ్యాటరీ, డ్యాష్ బోర్డ్ వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. ఆడియో సిస్టమ్ మెయింటెనెన్స్ అస్సలు పట్టించుకోరు. దాంతో కొన్ని రోజులకే అది పాడైపోతుంది. అలాంటి వారు ఈ టిప్స్ పాటించారంటే వెహికల్ ఆడియో సిస్టమ్ ఎక్కువ కాలం మంచి కండిషన్లో ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాఫ్ట్ మైక్రోఫైబర్ యూజింగ్ :కారు ఆడియో సిస్టమ్ మంచి కండిషన్లో ఉండడంలో హెడ్ యూనిట్, స్పీకర్లు, యాంప్లిఫయర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటన్నింటితో ఆడియో సిస్టమ్ యూనిట్‌ను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి. వీటిపైన పడిన దుమ్ము, దూళిని తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా ఉండే కెమికల్స్‌ను వాడకూడదు. అలా కాదని యూజ్ చేస్తే అవి ఆడియో సిస్టమ్ పార్ట్స్ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లీనింగ్‌కు సాఫ్ట్ మైక్రోఫైబర్ మాత్రమే యూజ్ చేయాలి.
లో వాల్యూమ్ మెయింటెనెన్స్ : కారు ఆడియో సిస్టమ్‌లో త్వరగా రిపేర్‌కు వచ్చేవి స్పీకర్లు. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది కారులో పాటలు వినడానికి హై వాల్యూమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. అలా ఎక్కువ సమయం ఉంచారనుకో స్పీకర్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ లో వాల్యూమ్‌లో సాంగ్స్ వినడం బెటర్.
కనెక్షన్స్ చెకింగ్ :కారు ఆడియో సిస్టమ్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పనేంటంటే.. ఆడియో సిస్టమ్‌ను క్లీన్చేసేటప్పుడు కనెక్షన్స్ చెక్ చేయడం. అంటే ఏవైనా ఈ సిస్టమ్‌కు సంబంధించిన కనెక్షన్స్ లూజ్‌గా ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా తుప్పు పట్టి ఉన్నాయా అనేది తనిఖీ చేసుకోవాలి. వీటితో పాటు.. ఎక్కడైనా తేమ లాంటిది ఉందా అనేదీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా మీ కారు ఆడియో సిస్టమ్ యూనిట్లు త్వరగా రిపేర్‌కు వస్తాయి. కాబట్టి తరచుగా వీటిని చెక్ చేసుకోవడం ఉత్తమం.
ఎలక్ట్రిక్ కార్స్, బైక్స్ వాడుతున్నారా? శీతాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!