Best Recharge Plan For Mobile Users :స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో, అన్లిమిటెడ్ రీఛార్జ్ తప్పనిసరిగా మారింది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఇది చేసుకుని తీరాల్సిందే. అపరిమిత ప్లాన్ల కోసం వివిధ టెలికాం కంపెనీలు రకరకాల టారిఫ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. వినియోగదారులు తాము వినియోగిస్తున్న కంపెనీ ఆధారంగా ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అయితే మన దేశంలో ముఖ్యంగా 3 ప్రైవేటు టెలికాం సర్వీసు ప్రొవైడర్ కంపెనీలున్నాయి. అవి భారతీఎయిర్‌టెల్, రిలయన్స్జియో, వొడాఫోన్ ఐడియా. టెలికాం రంగంలో సింహభాగం వాటా ఈ సంస్థలవే.
ఇదిలా ఉంటే- చాలా మంది వినియోగదారులు 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకునేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ప్రతి నెలకోసారి రీఛార్జ్ చేయించుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడం వల్ల రోజూ వాడే డేటా కూడా ఎక్కువే కావాలి. అయితే ప్రస్తుతం ఉన్న 3 కంపెనీలు అందిస్తున్న 84 రోజుల వ్యాలిడిటీతో డైలీ 2జీబీ డేటా ప్లాన్స్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? యూజర్స్ ఏ ప్లాన్ ఎంచుకుంటే బెస్ట్ అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రిలయన్స్ జియో
Jio Best Plan For 84 Days :ఈ తరహా ప్లాన్లు జియోలో మొత్తం తొమ్మిది ఉన్నాయి. అయితే అందులో బాగా ఉపయోగపడేది అంటే రూ.719 ప్లాన్. దీనిని రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లాంటి ఇతర సేవల్ని కూడా వినియోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ 5జీ సేవల్ని కూడా కస్టమర్లు ఆస్వాదించవచ్చు. దీని కాలపరిమితి 84 రోజులు.