Best Post Office Saving Schemes in Telugu :ఎవరైనా భవిష్యత్తులో మంచి లాభాలు అందించే పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ సమయంలో చాలా మంది రెగ్యులర్ ఆదాయంతో తక్కువ రిస్క్ తీసుకునే పథకాల వైపు చూస్తారు. ఎందుకంటే.. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ(Investment Policy)లో పెట్టుబడి పెట్టాలంటే రిస్క్ ఉంటుంది. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ అద్భుతమైన పొదుపు పథకాలు అందిస్తోంది. ఈ లిస్టులో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) లాంటి పథకాలు ఉన్నాయి. అయితే.. వీటిలో దేంట్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది? అధిక లాభాలు ఎందులో వస్తాయి? అలాగే తక్కువ కాలంలో మంచి రిటర్న్స్ ఎందులో వస్తాయని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..? పూర్తి వివరాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
National Saving Certificate :నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(NSC) అనేది పోస్టాఫీసు ద్వారా 5 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే స్థిర ఆదాయ పొదుపు పథకం. మధ్యతరగతి ప్రజలకు తక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్‌లో ఒకేసారి డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. నెలవారీ కంట్రిబ్యూషన్ చేయడం ఇందులో కుదరదు. పోస్టాఫీస్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం రూ.1,000 చాలు. ఆ తర్వాత ఎంత డబ్బు అయినా జమ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంత పొదుపు చేయాలనుకున్నా ఒకేసారి చేయాలనే విషయం పాలసీదారు గుర్తుంచుకోవాలి. జులై 1, 2023 నాటికి ఈ స్కీమ్‌లో వడ్డీరేటు 7.7 శాతానికి పెరిగింది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ప్రయోజనాలు(National Saving Certificate Benefits) :దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి పథకం. పన్ను ప్రయోజనాలతో పొదుపు చేసేలా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం ఈ స్కీమ్ లక్ష్యం. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా(ముగ్గురు వరకు) లేదా మైనర్ కోసం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ను పోస్టాఫీస్‌లో అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఎవరైనా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఎంత పొదుపు చేసినా ఐదేళ్ల వరకు వేచి చూడాలి. మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు వడ్డీ కూడా ఈ స్కీమ్‌లో వస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పథకం ద్వారా ₹1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?