Best Home Loan Interest Rates Details in Telugu: సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నదైనా.. పెద్దదైనా.. తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతారు. కొందరు, రుణ భారం లేకుండానే ఇంటిని సొంతం చేసుకుంటే, మరికొందరికి అప్పు చేయక తప్పదు. అందుకే వీరు లోన్ కోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. దాదాపు అన్ని బ్యాంకులు హోం లోన్ ఆఫర్ చేస్తాయి.
Home Loan Interest Rates 2023: హోమ్ లోన్ అనేది.. ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకునే అతి పెద్ద రుణం కావచ్చు. అమౌంట్‌తో పాటు, అప్పు తీర్చే సమయం కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి లాంగ్‌టర్మ్ లోన్ల విషయంలో, అప్పు తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, హోమ్ లోన్ విషయంలో కీలకమైనది వడ్డీ రేటు. ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకి హోమ్ లోన్ దొరికితే.. అది బెస్ట్ హోమ్ లోన్ రేట్ అవుతుంది.
Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్ అందించే బ్యాంకులివే..!
ఇటీవల పండగల నేపథ్యంలో పలు బ్యాంకులు హోం లోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ప్రాసిసెంగ్ ఫీజును చాలా వరకు మాఫీ చేశాయి. సిబిల్ స్కోరును బట్టి హోం లోన్ వడ్డీ రేట్లలో రాయితీలు కూడా ప్రకటించాయి. ఇక ఇప్పుడు హోం లోన్లపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..? రూ. 30 లక్షల లోన్‌పై 20 ఏళ్ల కాల వ్యవధిపై ఏ బ్యాంకులో ఈఎంఐ ఎలా ఉంది.? ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో హోం లోన్ వడ్డీ రేట్లు 8.60-9.65 శాతంగాఉన్నాయి. ఈఎంఐ రూ.26వేల 225-28వేల 258 గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.35 శాతం వరకు ఉంది. ప్రస్తుతం పండగ ఆఫర్ కింద మినహాయింపు ఉంది.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 10.80 శాతంగా ఉంది. ఈఎంఐ రూ.25వేల 845-రూ.30వేల 558 గా ఉంది. లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి 10.10 శాతంగా ఉండగా.. ఈఎంఐ రూ. 26,035 నుంచి రూ. 29,150 గా ఉంది. 2024, మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోం లోన్ వడ్డీ రేటు 8.30 శాతం నుంచి 10.75 శాతంగా ఉంది. ఇక ఈఎంఐ విషయానికి వస్తే.. రూ. 25వేల 656 నుంచి రూ. 30వేల 457 గా ఉంది. 2023, డిసెంబర్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.