Best Credit Cards For Dining: చాలా మంది విహార యాత్రల పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. మరికొంతమంది ఉద్యోగాల రీత్యా, సందర్శనల పేరుతో విదేశాలకు వెళ్తుంటారు. అప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండే రుచికరమైన వంటకాలను రుచి చూడాలని మనసు తహతహలాడుతుంది. కానీ.. ఆ రెస్టారెంట్లలో ఉండే ధరలను చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే.. ప్రత్యేకంగా భోజనం కోసమే క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. ఇందులో ఉత్తమ క్రెడిట్ కార్డులు ఏవి..? డిస్కౌంట్ ఎంత వస్తుంది..? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
1. హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా క్రెడిట్ కార్డ్
HDFC Bank Regalia Credit Card:
ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.2,500 చెల్లించాలి.
- సంవత్సరం కాలం పాటు Zomato గోల్డ్ సభ్యత్వం లభిస్తుంది.
- ఫుడ్ ట్రైల్ డైనింగ్ ప్రోగ్రామ్ ఆఫర్లు ఉంటాయి.
- భాగస్వామితో వారాంతాల్లో గడిపే ఫైన్ డైనింగ్‌పై 40శాతం డిస్కౌంట్ ఉంటుంది.
- వారంలో అన్ని రోజులూ ప్రీమియం డైనింగ్‌పై 20శాత తగ్గింపు లభిస్తుంది.
- చెఫ్ ప్రత్యేక రెస్టారెంట్లలో 30శాతం తగ్గింపు ఉంటుంది.
- డిన్నర్ బఫేలపై 25శాతం తగ్గింపు లభిస్తుంది.
- వివిధ కేటగిరీలపై వెచ్చించే ప్రతి 150 రూపాయలకు 4 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి.
Credit Card Cancellation : ఈ తప్పులు చేస్తే.. మీ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ కావచ్చు జాగ్రత్త!
2. ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్..
SBI Card Prime:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ2,999 చెల్లించాలి.
- త్రైమాసికానికి రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ.1,000 పిజ్జా హట్ ఈ-వోచర్‌లు వస్తాయి.
- భోజన కార్యకలాపాలకు ఖర్చు చేసే ప్రతి రూ.100కి 10 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
- వినియోగదారుని పుట్టినరోజున ఖర్చు చేసే ప్రతి రూ.100కి 20 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
3. కోటక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
Kotak Delight Platinum Credit Card:
- ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.1,999 చెల్లించాలి.
- డైనింగ్, సినిమాలు, ప్రయాణంపై 10శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
- భోజనం రూ.600పైగా ఉంటే క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
క్రెడిట్ కార్డును అతిగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
4. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్
American Express Platinum Travel Credit Card:
- ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.3,500 చెల్లించాలి.
- భాగస్వామితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్తే.. 15-20శాతం తగ్గింపు ఉంటుంది.
- ఖర్చు చేసే ప్రతి రూ.50కి 1 మెంబర్‌షిప్ పాయింట్ లభిస్తుంది.
- సభ్యులకు కాంప్లిమెంటరీ పాస్ దక్కుతుంది.
5. స్టాండర్డ్ చార్టర్డ్ అల్టిమేట్ క్రెడిట్ కార్డ్
Standard Chartered Ultimate Credit Card:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ.5,000 చెల్లించాలి.
- దేశంలోని టాప్ 250 రెస్టారెంట్లలో భోజనానికి 25శాతం తగ్గింపు ఉంటుంది.
- కార్డ్ హోల్డర్ల కోసం కాంప్లిమెంటరీ టేబుల్ బుకింగ్ సేవలు ఉంటాయి.
- 100కి పైగా గ్లోబల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది.
6. సిటీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
Citi Cashback Credit Card:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ.500 చెల్లించాలి.
- 2000 మంది వరకు డైనింగ్ పార్ట్నర్స్ ఉండే రెస్టారెంట్లలో.. 15శాతం తగ్గింపు లభిస్తుంది.
- అన్ని ఇతర కొనుగోళ్లపై 0.5శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
7. కోటక్ ఫీస్ట్ గోల్డ్ క్రెడిట్ కార్డ్
Kotak Feast Gold Credit Card:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ.499 చెల్లించాలి
- భోజనానికి ఖర్చు చేసే ప్రతి రూ.100కి 10 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి
- 1 డైనింగ్ పాయింట్ రూ.1కి సమానంగా ఉంటుంది.
- బిల్లింగ్ సైకిల్‌లో డైనింగ్ పాయింట్‌లు క్రెడిట్ అవుతాయి.
8. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్
Axis Bank My Zone Credit Card:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ.500 చెల్లించాలి.
- భాగస్వామితో రెస్టారెంట్లలో చేసే భోజనానికి 20శాతం తగ్గింపు ఉంటుంది.
- ప్రతి త్రైమాసికానికీ 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది
- ఖర్చు చేసిన ప్రతి రూ.200కి 4 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
9. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్
HDFC Bank Diners Club Privilege Credit Card:
- ఈ కార్డుకువార్షిక రుసుము రూ.2,500 చెల్లించాలి.
- ప్రీమియం డైనింగ్ సేవలు, టేబుల్ రిజర్వేషన్, డైనింగ్ రెఫరల్స్ ఉచితంగా లభిస్తాయి.
- కాంప్లిమెంటరీ Zomato గోల్డ్ సభ్యత్వం దక్కుతుంది.
10. ఐసీఐసీఐ బ్యాంక్ రూబిక్స్ క్రెడిట్ కార్డ్
ICICI Bank Rubix Credit Card:
- ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.2,000 చెల్లించాలి.
- ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లపై 30% తగ్గింపు ఉంటుంది.
- Zomato గోల్డ్ మెంబర్‌షిప్‌పై 50% తగ్గింపు ఉంటుంది.
- ICICI బ్యాంక్ క్యులినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్‌కు యాక్సెస్ ఉంటుంది.
- క్యూలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ కింద ఆదివారం 20శాతం తగ్గింపు ఉంటుంది.
- Swiggyపై అదనంగా 20శాతం తగ్గింపు లభిస్తుంది.
మీకు బెస్ట్ క్రెడిట్ కార్డు కావాలా? అయితే ఇలా ఎంపిక చేసుకోండి!