తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.8 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే! - Maruti Swift Features

Best Cars Under 8 Lakh In Telugu : మీరు మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.8 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్లో లభిస్తున్న టాప్​-10 కార్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 10 Cars Under 8 Lakhs
Best Cars Under 8 Lakhs

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 3:09 PM IST

Best Cars Under 8 Lakh :భారతదేశంలో రోజురోజుకూ కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన, వ్యాపార అవసరాల కోసం మంచి కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో, మంచి లుక్స్​తో, బెస్ట్ ఫీచర్స్, స్పెక్స్​తో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించి, మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.8 లక్షల బడ్జెట్​లోని టాప్​-10 కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Tata Punch Features : ఈ టాటా పంచ్ అనేది ఒక 5 సీటర్​ ఎస్​యూవీ కారు. దీనిలో​ 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 86.63 bhp పవర్, 3350 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్​జీ ఆప్షన్​లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్​ 18.8 kmpl, సీఎన్​జీ వేరియంట్ 26.99 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 33 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్​ ఎక్స్​టర్​, మారుతి స్విఫ్ట్​ కార్లతో పోటీపడుతోంది.

Tata Punch Price :మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర రూ.5.99 లక్షల నుంచి రూ.10.09 లక్షల వరకు ఉంటుంది.

2. Maruti Swift Features : ఈ మారుతి స్విఫ్ట్ అనేది ఒక 5 సీటర్ హ్యాచ్​బ్యాక్​ కారు. దీనిలో​ 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 85.50 bhp పవర్, 4400 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్​జీ ఆప్షన్​లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్​ 22.38 kmpl, సీఎన్​జీ వేరియంట్ 30.9 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 11 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో ఇది నేరుగా హ్యుందాయ్​ గ్రాండ్ ఐ10 నియోస్​, టాటా పంచ్ కార్లతో పోటీపడుతోంది.

Maruti Swift Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి స్విఫ్ట్​ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

3. Kia Sonet Features : ఈ కియా సోనెట్ అనేది ఒక 5 సీటర్ ఎస్​యూవీ​ కారు. ఇది​ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్​, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కార్​ ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారు 4000 rpm వద్ద 114 bhp పవర్, 4200 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 18-19 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 19 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా XUV300లతో పోటీపడుతోంది.

Kia Sonet Price :మార్కెట్లో ఈ కియా సోనెట్ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.15.69 లక్షల వరకు ఉంటుంది.

4. Mahindra XUV300 Features : ఈ మహీంద్రా XUV300 అనేది ఒక 5 సీటర్ ఎస్​యూవీ​ కారు. ఇది​ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్​, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కార్లు ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 3750 rpm వద్ద 115 bhp పవర్, 2500 rpm వద్ద 300 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 16.5 - 20.1 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 25 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్​ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

Mahindra XUV300 Price : మార్కెట్లో ఈ మహీంద్రా XUV300 కారు ధర సుమారుగా 7.99 లక్షల నుంచి రూ.14.75 లక్షల ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

5. Hyundai Exter Features : ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ అనేది ఒక 5 సీటర్​ ఎస్​యూవీ కారు. దీనిలో​ 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 81.80 bhp పవర్, 4000 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్​జీ ఆప్షన్​లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్​ 19.2 kmpl, సీఎన్​జీ వేరియంట్ 27.1 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 17 వేరియంట్లలో, 9 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి మారుతి బాలెనో, మారుతి బ్రెజ్జా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

Hyundai Exter Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్ కారు ధర రూ.6.12 లక్షల నుంచి రూ.10.27 లక్షల వరకు ఉంటుంది.

6. Nissan Magnite Features : ఈ నిస్సాన్ మాగ్నైట్​ అనేది ఒక 5 సీటర్ ఎస్​యూవీ​ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారు 5000 rpm వద్ద 98.63 bhp పవర్, 3500 rpm వద్ద 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 17.4 - 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 32 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ ఎక్స్​టర్​, కియా సోనెట్​లు పోటీగా ఉన్నాయి.

Nissan Magnite Price : మార్కెట్లో ఈ నిస్సాన్ మాగ్నైట్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.11.02 లక్షల వరకు ఉంటుంది.

7. Renault KWID Features : ఈ రెనో క్విడ్​​ అనేది ఒక 5 సీటర్ హ్యాచ్​బ్యాక్​​ కారు. దీనిలో 1 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారు 5500 rpm వద్ద 67.06 bhp పవర్, 4250 rpm వద్ద 91 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 21.46 - 22.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 11 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది మారుతి ఆల్టో కె10, మారుతి ఇగ్నిస్​తో నేరుగా పోటీపడుతోంది.

Renault KWID Price : మార్కెట్లో ఈ రెనో క్విడ్ కారు ధర రూ.4.69 లక్షల నుంచి రూ.6.44 లక్షల రేంజ్​లో ఉంటుంది.

8. Citroen C3 Features : ఈ సిట్రోయెన్​ సీ3 అనేది ఒక 5 సీటర్ ఎస్​యూవీ​​ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​తో మాత్రమే వస్తుంది. ఈ కారు 5500 rpm వద్ద 108.62 bhp పవర్, 3750 rpm వద్ద 115 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 19.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 7 వేరియంట్లలో, 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో కియా సోనెట్​, హ్యుందాయ్ ఎక్స్​టర్​ల నుంచి సిట్రోయెన్ సీ3 గట్టిపోటీ ఎదుర్కొంటోంది.

Citroen C3 Price : మార్కెట్లో ఈ సిట్రోయెన్ సీ3 కారు ధర రూ.6.16 లక్షల నుంచి రూ.8.95 లక్షల వరకు ఉంటుంది.

9. Toyota Glanza Features : ఈ టయోటా గ్లాంజా​ అనేది ఒక 5 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కారు. దీనిలో​ 1.2 లీటర్ సామర్థ్యంగల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 6000 rpm వద్ద 88.50 bhp పవర్, 4400 rpm వద్ద 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సీఎన్​జీ ఆప్షన్​లోనూ లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్​ 30.61 kmpl, సీఎన్​జీ వేరియంట్ 30.61 km/kg మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు ఆటోమేటిక్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. ఈ కారు 9 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హోండా అమేజ్, హ్యుందాయ్ వెన్యూ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

Toyota Glanza Price :మార్కెట్లో ఈ టయోటా గ్లాంజా కారు ధర సుమారుగా రూ.6.81 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

10. Honda Amaze Features : ఈ హోండా అమేజ్​ అనేది ఒక 5 సీటర్ సెడాన్​​​ కారు. దీనిలో 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారు 6000 rpm వద్ద 88.50 bhp పవర్, 4800 rpm వద్ద 110 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు లీటర్​కు 18.3- 18.6 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 7 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హ్యుందాయ్ ఎక్స్​టర్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.7.15 లక్షల నుంచి రూ.9.91 లక్షల వరకు ఉంటుంది.

మంచి స్కూటర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 మోడల్స్ ఇవే!

సూపర్ ఫీచర్లతో 2024 కియా సోనెట్‌ మోడల్​- ధర ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details