Best Car Insurance Add on Covers : లక్షలాది రూపాయలు పోసి కారు కొనుగోలు చేస్తారు. దానికి పూర్తిస్థాయిలో బీమా చేయించే విషయంలో మాత్రం చాలా మంది లైట్ తీసుకుంటారు. ఇండియాలో ఏ మోటారు వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా(Third Party Insurance) తప్పనిసరని అందరికీ తెలిసిందే. కానీ.. ఈ బీమా.. కారుకు జరిగే నష్టాలను మాత్రమే ఆర్థికంగా కవర్ చేస్తుంది.
ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 7 ముఖ్యమైన యాడ్-ఆన్‌లు తోడయితే.. కారు యజమానికి కూడా మరింత ఆర్థిక రక్షణ దొరుకుతుంది. రూ.7,000-రూ.12,000 విలువైన ఈ కారు ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు తీసుకోవడం ద్వారా.. వర్షకాలంలో జరిగే 2 నుంచి 4 లక్షల రూపాయల నష్టాల నుంచి కూడా కారు(Car) యజమాని బయటపడవచ్చు. ఇంతకీ ఆ 7 ముఖ్యమైన యాడ్-ఆన్‌లు ఏంటి? వాటి వల్ల పొందే లాభాలేంటి? అన్నది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Zero Depreciation Cover(జీరో-డిప్రిసియేషన్ కవర్) :కారు విలువ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. మీ కారుకు బీమా ఉన్నప్పటికీ తగ్గుదల వలన అయ్యే ఖర్చులను మీరు సొంతంగా చెల్లించాలి. కానీ, ఈ జీరో డిప్రిసియేషన్ కవర్ యాడ్ ఆన్ ఉన్నప్పుడు మీ కారు భాగాలు ప్రమాదాలలో దెబ్బతిన్నట్లయితే లేదా నీటిలో మునిగిపోయినట్లయితే, కారు భాగాలను మార్చడానికి అయ్యే పూర్తి ఖర్చును క్లెయిం చేయొచ్చు. ఈ యాడ్-ఆన్ ద్వారా వాహన భాగాలకు నష్టం వాటిల్లినప్పుడు పూర్తి రక్షణ ఉంటుంది. దీనికి గానూ బీమా సంస్థ రిపేర్ క్లెయిం సందర్భంలో రూ.80,000 వరకు చెల్లిస్తుంది. అదే ఈ యాడ్-ఆన్ లేకపోతే సమగ్ర బీమాలో రూ.40,000 వరకు మాత్రమే రిపేర్ క్లెయిం అందుతుంది.
Roadside Assistance Cover(రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్) :వర్షాకాలంలో వాహన బ్రేక్‌డౌన్‌లు అధికంగా జరుగుతుంటాయి. ఆగకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో వాహనం స్టార్ట్ కాకపోవడం, రోడ్డుపై వాహన టైర్ పగిలిపోయిన సందర్భంలో సహాయం పొందడానికి ఈ 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్‌ను తీసుకోవచ్చు. దీనిలో టోయింగ్, బ్యాటరీ జంప్-స్టార్ట్, టైర్‌లను బిగించడం, తదుపరి ప్రయాణానికి అద్దె వాహనాన్ని అందించడం, ముఖ్యమైన వారికి సమాచారాన్ని తెలిపే సేవలుంటాయి. అలాగే ఈ కవరేజ్ రోడ్డు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఆదా అవుతుంది.
Consumables Cover(కన్జూమబుల్స్(వినియోగ)కవర్) :సాధారణంగా ఓన్ డ్యామేజ్ పాలసీ.. ఆయిల్, నట్స్, బోల్ట్స్, ఏసీ, రిఫ్రిజరెంట్, రేడియేటర్ కూలెంట్ మొదలైన వినియోగ వస్తువుల ఖర్చులను కవర్ చేయదు. కానీ, ఎప్పుడైనా కారుకు నష్టం జరిగినప్పుడు ఇలాంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అదే ఈ యాడ్-ఆన్ కవర్‌ను తీసుకోవడం వల్ల అలాంటి వాటిని ఆదా చేసుకోవచ్చు.
తక్కువ ప్రీమియంతో కార్ ఇన్సూరెన్స్.. మహిళా డ్రైవర్లైతే ఈ యాడ్-ఆన్స్ మస్ట్!