Best Bikes Under 70000 : కొత్త బైక్ కొనుక్కోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. మరికొందరికి తమ రోజువారీ ప్రయాణాల కోసం బైక్ అవసరం ఉంటుంది. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ వాహన తయారీ సంస్థలు తక్కువ బడ్జెట్లో మంచి లుక్స్, బెస్ట్ ఫీచర్స్, స్పెక్స్ ఉన్న, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను రూపొందించి, మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిలో రూ.70,000 రేంజ్‌లోని టాప్-8 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Hero HF Deluxe Features :ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97 CC సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 8000 rpm వద్ద 8.02 PS పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది ఒక లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ 4 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఇది బజాజ్ ప్లాటినా 100, హోండా సీడీ 110, హోండా షైన్ 100లో పోటీ పడుతోంది.
Hero HF Deluxe Price : మార్కెట్లో ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర రూ.65,468 నుంచి రూ.69,598 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
2. Honda Shine 100 Features :ఈ హోండా షైన్ బైక్‌లో 98 CC సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.38 PS పవర్, 5000 rpm వద్ద 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది ఒక లీటర్‌కు 67.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్‌లకు ఇది టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.
Honda Shine 100 Price : మార్కెట్లో ఈ హోండా షైన్ 100 బైక్ ధర సుమారుగా రూ.66,000 వరకు ఉంటుంది.
3. Bajaj Platina 100 Features :ఈ బజాజ్ ప్లాటినా బైక్‌లో 102 CC సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.9 PS పవర్, 5500 rpm వద్ద 8.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది ఒక లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో, 4 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హీరో స్ల్పెండర్ ప్లస్, హోండా షైన్లతో టఫ్ కంపిటీషన్ ఉంది.
Bajaj Platina 100 Price : మార్కెట్లో ఈ బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.68,819 వరకు ఉంటుంది.
4. TVS Sport Features : ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్‌లో 109 CC సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 7350 rpm వద్ద 8.29 PS పవర్, 4500 rpm వద్ద 8.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది ఒక లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100, హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్‌లతో ఇది పోటీ పడుతోంది.
TVS Sport Price : మార్కెట్లో ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర రూ.66,030 నుంచి రూ.71,220 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.