Best alternatives for Instead of Personal Loans :ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో.. డబ్బు అత్యవసరం అవుతుంది. తెలిసిన వారిని ఎవరిని అడిగీనా.. చాలా సార్లు "లేవు" అనే సమాధానమే వస్తుంది. అలాంటి సమయంలో చాలా మందికి గుర్తొచ్చేది పర్సనల్ లోన్(Personal Loan). ఇక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ లోన్స్ పొందడం మరింత ఈజీ అయింది.
అయితే.. వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీరేట్లు.. ఇతర రుణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ష్యూరిటీ, సెక్యూరిటీ లేకుండా ఇస్తారు కాబట్టి ఇక్కడ వడ్డీరేట్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ.. అవసరాలు వేధిస్తుంటాయి కాబట్టి చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అధిక వడ్డీలు చెల్లిస్తూ వస్తారు. అయితే.. మేము చెప్పే మార్గాలను అనుసరిస్తే.. తక్కువ వడ్డీకే లోన్స్ పొందవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన పని లేదు. మరి, ఆ మార్గాల్లో మీకు ఛాన్స్ ఉందేమో ఓ సారి చూడండి.
పీపీఎఫ్ ద్వారా..
మీరు ఏదైనా జాబ్ చేస్తుట్లయితే.. తప్పనిసరిగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) అకౌంట్ ఉంటుంది. ఇందులో ఉన్న డబ్బుపై మీరు రుణం పొందొచ్చు. ఇందుకోసం.. మీ పీపీఎఫ్ అకౌంట్ తీసి కనీసం ఏడాది అయినా ఉండాలి. అప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు ఆధారంగా మీరు లోన్ అమౌంట్‌ను పొందుతారు. పీపీఎఫ్ అకౌంట్లో ఉన్న మీ సొమ్ముకు 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ సొమ్ముపై మీరు లోన్ తీసుకుంటే.. 8.1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు పర్సనల్ లోన్‌పై అందించే వడ్డీరేటుతో పోల్చితే.. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
Personal Loan Tips: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!