Best Accessories for Car Clean :కొత్తగా కారు కొన్నవారు.. కొంతకాలం ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ.. ఆ తర్వాత పరిస్థితి మారిపోతుంది. సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. గుర్తొచ్చినప్పుడు వాష్ చేయిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ.. ఇదొక్కటే సరిపోదు. వాషింగ్తోపాటు మీ కారు(Car Care Tips) ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉండాలి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 5 టూల్స్‌ను మీ కారులో ఉంచుకోవడమే! మరి అవేంటి? వాటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
WD40 కిట్ : ఇది కారుకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించే మల్టీ-పర్సస్ లూబ్రికెంట్ అండ్ క్లీనర్(Multi Purpose Lubricant and Cleaner). బోల్ట్‌లు విప్పటానికి, తుప్పు పట్టకుండా చూడటానికి, వాటిలో తరచూ అంటుకునే దుమ్ము, ధూళిని తొలగించడానికి ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ కారు టూల్కిట్లో దీనిని తప్పక ఉండేలా చూసుకోవాలి. ఇది మార్కెట్లో 500 రూపాయల లోపే లభిస్తుంది.
కార్ పెర్ఫ్యూమ్ :నేటి బిజీబిజీ లైఫ్‌లో ఆఫీస్ పనులు లేదా ఇతరత్రా కారణాల వల్ల ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కారు ఎక్కగానే మంచి సువాసన వస్తే ఎవరికైనా చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. అలాగే చాలా మందికి కారు ఎక్కగానే ఏసీ ఆన్ చేసుకోవడం అలవాటు. ఈ క్రమంలో మీరు కారులో కార్ పర్ఫ్యూమ్(Car Perfume)ను పెట్టుకున్నట్లయితే.. అది మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇవి కూడా మార్కెట్లో రూ. 500లోపే అందుబాటులో ఉంటాయి.
మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!
కార్ బిన్ :ఇక చాలా మంది కారులో లాంగ్ జర్నీకి ప్లాన్ చేసుకున్నప్పుడు తినుబండారాలు, దుప్పట్లు, టవల్స్ లాంటివి తీసుకెళ్తుంటారు. ఇవన్నీ సీట్లపై పడేయడం ద్వారా కారు క్యాబిన్ చూడడానికి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అందుకోసం మీరు కార్ బిన్ను యూజ్ చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న ఐటమ్స్ అందులో ఉంచడం ద్వారా కారులో స్పేస్ మిగలడంతో పాటు క్లీన్‌గా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ లేదా డోర్ పాకెట్లో దీనిని సెట్ చేసుకోవచ్చు. దీనికీ రూ.500 లోపే ఖర్చవుతుంది.
మైక్రోఫైబర్ క్లాత్ :మీ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ను శుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సిన మరో ఇంపార్టెంట్ టూల్.. మైక్రోఫైబర్ క్లాత్. మీ కారు పై ఉన్న దుమ్ము, మురికిని చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇది కూడా మార్కెట్లో రూ. 500 ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ మైక్రో ఫైబర్ క్లాత్‌ను రీయూజ్ కూడా చేయవచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ తక్కువ రేటుకే దొరుకుతుంది.
కార్ ఫాస్ట్ ఛార్జర్ :ఇక చివరగా.. కొందరు ఎక్కడికైనా వెళ్లేముందు తరచూ ఫోన్‌కు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతుంటారు. ఇక తీరా కారులో ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడో లేదంటే లాంగ్ జర్నీలో ఉన్నప్పుడో ఈ విషయం గుర్తొస్తుంటుంది. ఆ టైమ్‌లో మీ కారులో Car Fast Charger ఉంటే ఈ సమస్య ఉండదు. ఇందుకోసం మీరు ఎంతో ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ ఫాస్ట్ ఛార్జర్‌ని కూడా కేవలం రూ.500 ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
మీ కారు విండ్ షీల్డ్‌పై పగుళ్లు వచ్చాయా? ఇలా సెట్ చేయండి!
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!