Best 5 Bikes for College Students in Telugu : ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి.. ఇలా పండగ ఏదైనా ఆ పర్వదినం రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఒక విలువైన వస్తువు కొనాలని చూస్తుంటారు. అలాగే ఈ ఫెస్టివల్ సీజన్లో ప్రతి రంగానికి సంబంధించిన వివిధ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మోటార్ వాహనాల సంస్థలు ద్విచక్రవాహనాలు, కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి. అయితే చాలా మంది తమ పిల్లల కోసం ఎప్పటి నుంచో బైస్ట్ బైక్ కొందామని ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఏది తీసుకోవాలో తెలియక కొంతమంది వాటిని పోస్ట్‌పోన్ చేస్తుంటే.. మరికొందరు బడ్జెట్ ప్రాబ్లమ్‌తో వాయిదా వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కాలేజీ స్టూడెంట్స్‌కి సరిపోయే 5 ఉత్తమ బైక్స్(Best Bikes)తో మీ ముందుకు వచ్చాం. ధర కూడా మీ బడ్జెట్లోనే ఉంది. ఇంతకీ ఆ బైక్స్ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కళాశాలకు వెళ్లేవారి కోసం టాప్ 5 ద్విచక్ర వాహనాలివే..
1. బజాజ్ పల్సర్ NS 200(Bajaj Pulsar NS 200) :బజాజ్ పల్సర్ NS 200 కళాశాలకు వెళ్లే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బైక్‌లలో ఇది ఒకటి. స్ట్రీట్‌ఫైటర్ స్టైలింగ్‌తో కూడిన ఈ స్పోర్టీ బైక్ కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆకర్షించేందుకు వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
Key Features of Bajaj Pulsar NS 200 in Telugu :
- ఇంజిన్ సామర్థ్యం -199.5 CC
- మైలేజ్ -35 KMPL
- ఇంజిన్ స్పెసిఫికేషన్స్ -SOHC 4-valve and stroke
- కూలింగ్ టెక్నాలజీ- లిక్విడ్-కూల్డ్
- మాక్సిమమ్ టార్క్-18.74 NM @ 8,000 RPM
- మాక్సిమమ్ పవర్ - 18 KW @ 9,750 RPM
- Kerb weight - 159.5 KG
- ఇంధన సామర్థ్యం - 12 ఎల్
2. హోండా డియో(Honda Dio) : ఈ ద్విచక్రవాహనం యువతకు మార్కెట్లో అందుబాటులో ఉన్న మరొక ఉత్తమ బైక్‌గా నిపుణులు సూచిస్తున్నారు. ఇది అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు బెటర్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. అలాగే పని చేసే మహిళలు కూడా రోజువారీ పనికి వెళ్లేందుకు ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ తేలికపాటి ద్విచక్ర వాహనం కళాశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ స్కూటర్ ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ ధరకు లభిస్తూ అద్భుతమైన మైలేజీని అందిస్తుంది.
Key Features of Honda Dio :
- ఇంజిన్ సామర్థ్యం - 109.51 CC
- మైలేజ్ - 48 KMPL
- ఇంజిన్ స్పెసిఫికేషన్స్ -BS-VI నిబంధనలను అనుసరించే సింగిల్-సిలిండర్ ఇంజిన్
- కూలింగ్ టెక్నాలజీ - ఫ్యాన్ కూల్డ్
- గరిష్ఠ టార్క్ - 9 NM @ 4,750 RPM
- మాక్సిమమ్ పవర్ - 7.76 PS @ 7, 000 RPM
- Kerb weight - 105 KG
- ఇంధన సామర్థ్యం- 5.3 ఎల్
3. హోండా CB హార్నెట్ 160R (Honda CB Hornet 160R) : అబ్బాయిల కోసం ఆకర్షణీయమైన స్టూడెంట్ బైక్‌ల విషయానికి వస్తే హోండా CB హార్నెట్ 160R ఒక ఉత్తమ ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది పెద్ద ఇంధన ట్యాంక్‌తో కూడిన భారీ వెయిట్‌ను కలిగి ఉంది. ఇక ఈ ద్విచక్రవాహనం ముఖ్యమైన ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.