Banks Will Pay 100 Rupees Per Day for ATM Withdraw Issues in Telugu : డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం వద్దకు వెళ్తే.. కొన్నిసార్లు మనీ డెబిట్ అయ్యినట్టు మెస్సెజ్ వస్తుంది గానీ.. ఏటీఎం నుంచి డబ్బులు రావు. ఇలాంటి సందర్భాల్లో.. ఆర్బీఐ రూల్ తెలిసిన వారు సింపుల్‌గా డబ్బులు పొందవచ్చు. అంతేకాదు.. ప్రత్యేక పరిస్థితుల్లో పరిహారం కూడా పొందొచ్చు.
RBI Rules for ATM Debit Card Failed Transactions :అకౌంట్లో డబ్బులు డెబిట్ కావడం.. ఏటీఎం నుంచి మాత్రం డబ్బులు రాకపోవడం అనే సమస్య..చాలా మంది ఖాతాదారులకు ఎదురవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో..రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టమైన మార్గదర్శకాలను పాటించింది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఖాతాదారుల ప్రయోజనాలకు సంరక్షించేందుకు కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. విఫలమైన లావాదేవీలను టర్న్ అరౌండ్ టైమ్(టీఏటీ) పద్దతిలో పరిష్కరించాలని ఆర్బీఐ ఆదేశించింది. పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టపరిహారం చెల్లించాలని కూడా బ్యాంకులను ఆదేశించింది.
How To Protect Yourself From ATM Card Fraud: ఏటీఎం కార్డ్ మోసాలు.. మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి!
సాధారణంగా ఏటీఎమ్‌లలో నగదు లేకపోవడం.. కమ్యూనికేషన్ లింక్ వైఫల్యం, సెక్షన్ల సమయం ముగియడం వంటి కారణాలతో లావాదేవీలు విఫలం అవుతుంటాయి. అయితే.. ఇలాంటి లావాదేవీలను బ్యాంకులు సత్వరమే పరిష్కరించాలి. ఒకవేళ గడువు తేదీలోపుగా బ్యాంకులు వీటిని పరిష్కరించ లేకపోతే.. సమస్య పరిష్కరించేంతకు వరకు రోజుకు కొంత మొత్తాన్ని నష్టపరిహారంగా వినియోగదారునికి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.