Banks Can Activate Alert System For Digital Payments :ఆన్లైన్ మోసాలు జరగకుండా.. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సురక్షితం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో రూ.5,000 లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు.. వారిని బ్యాంకులు అలర్ట్ చేసే విధంగా ఒక వ్యవస్థను తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.
కొత్త వారికి మాత్రమే!
Alert System For Digital Payment Worth 5000 And More :ఈ అలర్ట్ సిస్టమ్‌ను కేవలం కొత్త వినియోగదారులు, విక్రేతలు చేసే ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఆన్లైన్, డిజిటల్ చెల్లింపుల్లో జరిగే మోసాలను నివారించడానికి ఇది తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు, మీరు యూపీఐ లాంటి రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రూ.5000 విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని అనుకున్నారు. అప్పుడు ఆ రూ.5,000 డెబిట్ అయ్యే ముందు.. మీకు సదరు లావాదేవీని నిర్ధరించమని అడుగుతూ ఓ వెరిఫికేషన్ మెసేజ్ లేదా కాల్ వస్తుంది. మీరు నిర్దరించిన తరువాతనే.. పేమెంట్ అవుతుంది. అంటే దీని వల్ల యూజర్ల పేమెంట్స్‌కు భద్రత ఏర్పడుతుంది.
ఇప్పటికే పలు సంస్థలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ పద్ధతిని నిర్దిష్ట అధిక విలువ కలిగిన మొత్తాన్ని పంపించినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు మాత్రమే అమలు చేస్తున్నాయి.
4 గంటలు నిరీక్షించాల్సిన పనిలేదు!
4 Hour Delay For First UPI Payment : ఈ తాజా ప్రతిపాదన కనుక అమలైతే.. మొదటిసారి యూపీఐ పేమెంట్స్ చేసేవారు 4 గంటల వరకు వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఇంతకు ముందు మొదటిసారి యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. సదరు ఆర్థిక లావాదేవీ పూర్తి చేయడానికి కనీసం 4 గంటలు వేచిచూసే విధంగా ఓ ప్రతిపాదన చేశారు. కానీ ఇది డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు భారతదేశ డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ప్రతికూలంగా మారుతుంది. అందుకే తాజా అలర్ట్ సిస్టమ్ ప్రతిపాదనను అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సైబర్ మోసాలను అరికట్టేందుకే!
Cyber Security For Digital Payments : ఇటీవలే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనామిక్ అఫైర్స్ అధికారులతో.. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టాలనే అజెండాతో.. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
స్పామ్స్ కాల్స్ గుర్తించేలా!
How To Detect Spam Calls : కేంద్ర ప్రభుత్వం.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి, డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ద్వారా అనుమానాస్పద కాలర్ లిస్ట్‌ను యాక్టివేట్ చేయడం, స్పామ్ కాల్స్ వచ్చేటప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేయడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది.
డిసెంబర్ డెడ్‌లైన్స్ - గడువులోగా ఈ పనులన్నీ తప్పక పూర్తి చేయండి!
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు- ఎంతంటే?