తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబర్​​లో 6 రోజులపాటు బ్యాంకులు బంద్​ - AIBEA సమ్మె ఎఫెక్ట్​!

Bank Strike In December 2023 In Telugu : బ్యాంక్​ కస్టమర్లకు అలర్ట్. డిసెంబర్​ నెలలో బ్యాంకు ఉద్యోగులు 6 రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. వీటికి తోడు సాధారణ సెలవులు కూడా దాదాపు 14 రోజులు ఉన్నాయి. అందువల్ల బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఇప్పటి నుంచే తమ షెడ్యూల్​ను ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందిపడక తప్పదు. అందుకే బ్యాంక్​ స్ట్రైక్ ఏయే రోజుల్లో జరుగనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

6 Days Nationwide Bank Strike In December
bank strike in December 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 2:00 PM IST

Bank Strike In December 2023 : ఆల్​ ఇండియా బ్యాంక్​ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ (AIBEA) డిసెంబర్​ నెలలో.. 6 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్​ ఉద్యోగులు సమ్మె చేయనున్నారని ప్రకటించింది. బ్యాంకుల అవసరాలకు తగినంత మంది ఉద్యోగుల నియమాకం కోసం ఈ స్ట్రైక్​ చేపడుతున్నట్లు పేర్కొంది. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు బదులుగా.. అవుట్​సోర్సింగ్ ఉద్యోగులను నియమించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేస్తున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిందే!
AIBEA ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) సీహెచ్​ వెంకటాచలం.. 2019 నుంచి 2023 మధ్య కాలంలో బ్యాంకింగ్​ రిక్రూట్​మెంట్ చాలా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బ్యాంకింగ్ అవసరాలకు సరిపడా ఉద్యోగుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. అవుట్​సోర్సింగ్ ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలు అన్నీ తెలుపుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు.

బ్యాంక్​ స్ట్రైక్ ఎప్పుడంటే?
Nationwide Bank Strike In December : ఆల్​ ఇండియా బ్యాంక్​ ఎంప్లాయీస్​ అసోసియేషన్​ (AIBEA) ప్రకారం..

  • డిసెంబర్​ 4 : ఈ రోజున దేశవ్యాప్తంగా.. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్​ నేషనల్ బ్యాంక్​ (PNB), పంజాబ్​ అండ్ సింధ్ బ్యాంక్​ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
  • డిసెంబర్ 5 : ఈ రోజున దేశవ్యాప్తంగా.. బ్యాంక్​ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు స్ట్రైక్​ చేస్తారు.
  • డిసెంబర్ 6 : ఈ రోజు దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల స్ట్రైక్ ఉంటుంది.
  • డిసెంబర్​ 7 : యూనియన్ బ్యాంక్​, యూకో బ్యాంక్ ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు.
  • డిసెంబర్​ 8 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తారు.
  • డిసెంబర్​ 9 : దేశంలోని అన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు.. ఆల్​ ఇండియా లెవెల్​లో బ్యాంక్​ స్ట్రైక్​ చేయనున్నారు.

డిసెంబర్​లోని బ్యాంక్​ సెలవులు
Bank Holidays In December 2023 :డిసెంబర్​ నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉంది. పైగా ఈ 6 రోజుల స్ట్రైక్​ నడవనుంది. కనుక దాదాపుగా 20 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంక్ కస్టమర్లు తమ షెడ్యూల్​ను​ పక్కగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఆర్థిక లావాదేవీలకు ఇబ్బందులు తప్పవు.

సెలవు దినాలు సహా, సమ్మె సమయంలో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : డిసెంబర్​ నెలలో బ్యాంకు సెలవులు, సమ్మె ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే.. సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

డిసెంబర్​ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

ఈ 5 అలవాట్లు మిమ్మల్ని అప్పులపాలు చేస్తాయి - వెంటనే వాటిని మానుకోండిలా!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్​-10 కార్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details