Bank OTP fraud is on the rise Here is how to stay safe : టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతోందో.. మోసగాళ్లు కూడా అంతగా అప్డేట్ అవుతున్నారు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా.. వాటిని ఛేదించి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్‌లో మోసాలను అడ్డుకునేందుకు బ్యాంకులు OTP వ్యవస్థను తీసుకొచ్చాయి. ఇప్పుడు దాన్ని కూడా కొట్టేస్తూ.. బ్యాంకు అకౌంట్లు లూటీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో.. వినియోగదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.
విస్తరించిన టెక్నాలజీ జనాలకు ఎంతగా మేలు చేస్తున్నదో చెప్పాల్సిన పనిలేదు. గతంలో.. బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలంటే.. ఒక పూట లేదంటే ఒక రోజూ మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి. కానీ.. ఆన్లైన్ బ్యాంకింగ్, ATM, UPI వంటి వ్యవస్థలు వచ్చిన తర్వాత.. నిమిషాల్లో పనులు పూర్తవుతున్నాయి. అయితే.. దొంగలు సైతం రూటు మార్చి.. ఆన్లైన్లోనే తిష్ట వేస్తున్నారు. జనాల నుంచి డబ్బులు దోచేయడానికి కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నారు.
One Time Password Hacking : SMSల ద్వారా లింక్స్ పంపించి అకౌంట్లు హ్యాక్ చేయడం.. ఫోన్లు చేసి పాస్ వర్డ్స్ అడగడం వంటి చర్యల ద్వారా ఎంతో మందిని దోచేశారు. దీంతో.. బ్యాంకులన్నీ ఓటీపీ వ్యవస్థను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ ఓటీపీని కూడా చోరీ చేస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో.. జనాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి, ఓటీపీని సురక్షితంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి..? సైబర్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్‌ఫుల్
ఈ పనులు అస్సలు చేయకండి..
ఆఫర్లు, ఇతరత్రా పేర్లతో మీ ఫోన్లకు వచ్చే SMS లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి.
ఫోన్ చేసి ఎవరైనా మీ బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు అడిగితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. మీ బ్యాంకు ఎన్నడూ ఆ వివరాలు అడగదు.
మీకు సంబంధం లేని అటాచ్మెంట్లను డౌన్‌లోడ్ చేయడం ఆపేయండి.
ఎక్కడబడితే అక్కడ మీ పోన్ ద్వారా స్కాన్లు చేయకండి.
బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఎక్కడపడితే అక్కడ లభించే పబ్లిక్ వైఫై వాడకండి.
మీ ఓటీపీని మీరు ఎవరితోనూ షేర్ చేయకండి.