తెలంగాణ

telangana

ETV Bharat / business

విద్యార్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ అకౌంట్ - ఫ్రీగా రూ.2 లక్షల ప్రమాద బీమాతోపాటు మరెన్నో ప్రయోజనాలు!

BoB Student Account : బ్యాంక్ ఆఫ్ బరోడా మరో స్పెషల్ సేవింగ్ ఖాతాను తీసుకొచ్చింది. ఈ అకౌంట్​ను జీరో బ్యాలెన్స్ సదుపాయంతో విద్యార్థుల కోసం అందిస్తోంది. ఇది తీసుకున్న స్టూడెంట్స్​కు రూ.2 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీతోపాటు మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Bank of Baroda
Bank of Baroda bro account

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 10:27 AM IST

Bank of Baroda Student Special Account : కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని బ్యాంకులూ సరికొత్త నిర్ణయాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)ఈ మధ్యకాలంలో "లైట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌" పేరిట లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా.. ఫ్యామిలీ మెంబర్స్ కోసం "బీఓబీ పరివార్ అకౌంట్​"ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థుల కోసం.. జీరో బ్యాలెన్స్ సదుపాయంతో స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చింది. ఈ అకౌంట్​తో స్టూడెంట్స్ అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంక్ ప్రకటించింది. ఇంతకీ ఆ అకౌంట్ ఏమిటి? దాని ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BoB Bro Savings Account :విద్యార్థుల కోసం జీరో బ్యాలన్స్‌ సదుపాయంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన ఆ స్పెషల్ అకౌంటే..​ "బ్రో సేవింగ్స్ అకౌంట్". 16 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండే విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా ఈ అకౌంట్​ను అందిస్తున్నట్లు బీఓబీ తెలిపింది. స్టూడెంట్స్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని చెప్తోంది. ఈ అకౌంట్ తీసుకున్న విద్యార్థులకు జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డు సహా ఇతర ప్రయోజనాలనూ అందిస్తున్నట్లు బీఓబీ పేర్కొంది.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా గుడ్​న్యూస్- కుటుంబం మొత్తానికి ఒకే అకౌంట్​! కళ్లు చెదిరే బెనిఫిట్స్​!

బ్రో సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు..

  • ఈ అకౌంట్ ద్వారా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు పొందవచ్చు. ఈ కార్డు వాడే వారికి ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి.
  • అలాగే ప్రతి ఏటా రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
  • ఇది తీసుకున్న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఉచితంగా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ దక్కుతుంది.
  • ఈ అకౌంట్​తో ఆటో స్వీప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
  • ఈ అకౌంట్ ద్వారా అపరిమితమైన చెక్ బుక్స్ తీసుకోవచ్చు.
  • అలాగే ఉచితంగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్స్ పొందవచ్చు.
  • డీమ్యాట్ ఏఎంసీ పై 100 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
  • దీని ద్వారా ఎడ్యుకేషనల్ లోన్స్ పొందాలనుకుంటే.. ఆ లోన్స్​ పై వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇంకా.. జీరో ప్రాసెసింగ్ ఫీజు అప్లై అవుతుంది.
  • ఎడ్యుకేషన్ లోన్స్​పై వడ్డీ రేటులో 0.15 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.
  • అర్హులైన వారికి ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన క్రెడిట్ కార్డులు కూడా ఇస్తారు.

ఈ అకౌంట్​ను యువతకు చేరువ చేసేందుకుగాను ఐఐటీ బాంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్​నర్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా నియమించుకుంది. ప్రస్తుత ప్రపంచం వేగంగా మారిపోతున్న క్రమంలో న్యూ జనరేషన్ కస్టమర్లకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని బీఓబీ పేర్కొంది.

మహిళలకు గుడ్​న్యూస్- ఆ బ్యాంక్​లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!

ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్​ అకౌంట్లు ఉండొచ్చు? ఎక్కువ ఉంటే ఏమవుతుంది?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details