List of Bank Holidays in November 2023 :బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. 2023 నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ప్రకటించింది. వచ్చే నెలలో బ్యాంక్ పనుల కోసం తిరిగేవాళ్లు.. ఈ లిస్ట్‌ను కచ్చితంగా చూడాలి. ఫాలో కావాల్సి ఉంది. లేదంటే.. ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెలా.. బ్యాంక్ సెలవుల(Bank Holidays)జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నవంబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. ఇంతకీ.. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2023 నవంబర్ బ్యాంక్ సెలవులు..
November 2023 Bank Holidays :
- నవంబర్ 1 - బుధవారం (కరక చతుర్థి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.)
- నవంబర్ 5 - ఆదివారం
- నవంబర్ 10 - శుక్రవారం (వంగాల పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 11 - రెండో శనివారం
- నవంబర్ 12 - ఆదివారం (దీపావళి కూడా)
- నవంబర్ 13 - సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, దిల్లీలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 15 - బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 19 - ఆదివారం
- నవంబర్ 24 - శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 25 - నాలుగో శనివారం
- నవంబర్ 26 - ఆదివారం
- నవంబర్ 27 - సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు)
ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!