తెలంగాణ

telangana

ETV Bharat / business

మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవు! జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి!! - బ్యాంక్​ సెలవులు

Bank Holidays in May 2022: మేలో బ్యాంకు సెలవుల క్యాలెండర్​ను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.

Bank Holidays in May 2022
Bank Holidays in May 2022

By

Published : May 1, 2022, 12:57 PM IST

Updated : May 1, 2022, 3:34 PM IST

Bank Holidays in May 2022: ఆర్థిక లావాదేవీల కోసం మేలో బ్యాంక్‌కు వెళ్లాలా? అయితే ఈ సమాచారం మీ కోసమే! దేశవ్యాప్తంగా వివిధ పండగలు, సాధారణ సెలవులు కలిపి మేలో మొత్తం 11 సెలవు దినాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది. వీటిని గమనించి వినియోగదారులు తమ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది. ప్రాంతాల వారీగా బ్యాంకు​ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. మే 1: ఆదివారం
  2. మే 2: రంజాన్​
  3. మే 3: అక్షయ తృతీయ, భగవాన్​ శ్రీ పరశురామ జయంతి
  4. మే 8: ఆదివారం
  5. మే 9: రబీంద్రనాథ్​ ఠాగూర్​ జయంతి(కోల్​కతా)
  6. మే 14: రెండో శనివారం
  7. మే 15: ఆదివారం
  8. మే 19: బుద్ధ పూర్ణిమ (కోల్​కతా, ముంబయి, లఖ్​నవూ, శ్రీనగర్​, భోపాల్​, అగర్తలా)
  9. మే 22: ఆదివారం
  10. మే 28: నాలుగో శనివారం
  11. మే 29: ఆదివారం

మూడు కేటగిరీల కింద బ్యాంకులకు ఆర్​బీఐ సెలవులు ఇస్తుంది. హాలిడే అండర్​ నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ యాక్ట్​, రియల్​ టైమ్​ గ్రాస్​ సెటిల్​మెంట్​ హాలీడే, బ్యాంకుల అకౌంట్స్​ క్లోజింగ్​ కింద సెలవులు మంజూరు చేస్తుంది.

ఇదీ చదవండి:'మా భవిష్యత్ ఏంటి?'.. ట్విట్టర్ సీఈఓకు చుక్కలు చూపిస్తున్న ఉద్యోగులు!

Last Updated : May 1, 2022, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details