తెలంగాణ

telangana

ETV Bharat / business

2024 జనవరి నెల - బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

Bank Holidays In January 2024 In Telugu : 2024 జనవరి​ నెలలో ఏకంగా 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ షెడ్యూల్​ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బందిపడక తప్పదు. అందుకే ఏయే రాష్ట్రాల్లో, ఎప్పుడెప్పుడు బ్యాంక్​ సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

List of Bank Holidays In January 2024
bank holidays in January 2024

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 11:48 AM IST

Bank Holidays In January 2024 : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 2024 జనవరి​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్​ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆర్​బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2024 జనవరి నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 జనవరి​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా
List of Bank Holidays In January 2024 :

  • జనవరి 1 (సోమవారం) : ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
  • జనవరి 11 (గురువారం) : మిషనరీ డే సందర్భంగా మిజోరం రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 12 (శుక్రవారం) : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బంగాల్​లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 13 ( రెండో శనివారం) :
  • జనవరి 14 (ఆదివారం) : లోహ్రీ పండుగ సందర్భంగా పంజాబ్​ సహా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 15 (సోమవారం) :సంక్రాంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 16 (మంగళవారం) : పొంగల్​ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 17 (బుధవారం) : తిరువళ్లువర్​ డే సందర్భంగా తమిళనాడులో బ్యాంకుల సెలవు.
  • జనవరి 23 (మంగళవారం) : తుసు పూజ సందర్భంగా బంగాల్​, అసోం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 25 (గురువారం) : హిమాచల్​ ప్రదేశ్ ఆవిర్భావ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు.
  • జనవరి 26 (శుక్రవారం) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జనవరి 27 ( నాల్గో శనివారం) :
  • జనవరి 31 (బుధవారం) : మీ-డ్యామ్​-మీ-ఫై సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : జనవరి నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా కొనసాగుతాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్​ లేకున్నా లోన్​​ పొందండిలా!

దంపతుల కోసం బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​ - ఏకంగా రూ.5.55 లక్షల వడ్డీ!

ABOUT THE AUTHOR

...view details