Bank Holidays In December 2023 :బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్బీఐ ప్రతి నెలా.. బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా డిసెంబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2023 డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
List of Bank Holidays In December 2023 :
- డిసెంబర్ 1 (శుక్రవారం) : అరుణాచల్ ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 2 (శనివారం) : భారతదేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు.
- డిసెంబర్ 3 (ఆదివారం)
- డిసెంబర్ 5 (మంగళవారం) : షేక్ ముహమ్మద్ అబ్దుల్లా జయంతి సందర్భంగా జమ్ము, కశ్మీర్‌లోని బ్యాంకులకు సెలవు
- డిసెంబర్ 9 (రెండవ శనివారం)
- డిసెంబర్ 10 (ఆదివారం)
- డిసెంబర్ 18 (సోమవారం) :గురు ఘాసీదాస్ జయంతి సందర్భంగా చండీగఢ్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
- డిసెంబర్ 19 (మంగళవారం) : లిబరేషన్ డే సందర్భంగా గోవాలోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 23 ( నాల్గో శనివారం)
- డిసెంబర్ 24 (ఆదివారం)
- డిసెంబర్ 25 (సోమవారం) :క్రిస్టమస్ ఈవ్ సందర్భంగా మిజోరం, మేఘాలయల్లోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 26 (మంగళవారం) : సర్దార్ ఉద్ధమ్ సింగ్ జయంతి సందర్భంగా హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 30 (శనివారం) : తము లోసర్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
- డిసెంబర్ 31 (ఆదివారం)