FD VS NSC : కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన డబ్బులను ఎక్కడ పొదుపు చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే చోట పొదుపు చేయడం అవసరం. అందుకోసం పొదుపు మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు, గృహ నిర్మాణం, రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం ముందు నుంచే పొదుపు చేయడం మంచిది. కనుక ఉత్తమ పొదుపు మార్గాలు ఏవో తెలుసుకుని డబ్బులను జాగ్రత్తగా మదుపు చేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో అధిక రాబడిని అందించే వాటిల్లో ఏది బెస్ట్ స్కీమ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్డ్ డిపాజిట్లు
Bank Fixed Deposit Benefits : డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). ఇది అందరికీ సుపరిచితమే. అన్ని ఖర్చులూ పోనూ తమ దగ్గర ఉన్న కొంత మిగులు సొమ్ముపై హామీ పూర్వకమైన రిటర్న్ కావాలని భావిస్తే ముందే ఆలోచించి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పలు రకాల పథకాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తుంటాయి. ఆయా కంపెనీల బ్రాంచ్లకు వెళ్లి ఎఫ్డీల్లో డబ్బులను డిపాజిట్ చేయొచ్చు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటు మాత్రం స్థిరంగా ఉంటుంది. మనం ఎంత కాలానికి డబ్బులను డిపాజిట్ చేస్తే అంత కాలానికి నిర్దేశిత వడ్డీరేటును హామీ పూర్వకంగా పొందే వీలు ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
National Savings Certificate Benefits : డబ్బులను పెట్టుబడిగా పెట్టేవారు ఎక్కడ తక్కువ రిస్క్ ఉంటుంటో అక్కడే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలా రిస్క్ తక్కువగా ఉండే వాటిల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే మోడీ ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాల్లో కూడా మంచి రాబడి అందుతోంది. అలాంటి వాటిల్లో ఒకటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో భాగంగా రూ.1,000 ఉన్నా సరే ఎన్ఎస్సీ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టాలని నియమం ఏమీ లేదు. ఎంత భారీ మొత్తంలోనైనా డబ్బులను ఇక్కడ దాచుకోవచ్చు.
పన్ను మినహాయింపులు
ఎన్ఎస్సీ పథకంతో పాటు బ్యాంకులు అందించే ఐదేళ్ల లాకిన్ పీరియడ్ డిపాజిట్లకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం వడ్డీ రేటును 7.7 శాతంగా నిర్ణయించింది. అందువల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం..