Bajaj Pulsar NS400 Features and Pricing : మార్కెట్లో పల్సర్ బైక్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాల్సిందే. తొలినాళ్లలో ఆ బైక్ క్రేజ్ అలా ఉండేది మరి. అయితే.. ఇప్పటికీ యూత్‌లో పల్సర్ పై క్రేజ్ ఉంది. దాన్ని కొనసాగించేందుకు బజాజ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తోంది. ఇటీవల బజాజ్ పల్సర్ NS (Bajaj Pulsar NS). మోడల్స్‌ను మార్కెట్లోకి వదులుతోంది.
Bajaj Pulsar NS400 Specifications in Telugu :ఇప్పటికే బజాజ్ ప్రవేశపెట్టిన 'ఎన్ఎస్160'(Pulsar NS160),'ఎన్ఎస్200'(Pulsar NS200) బైక్‌లు మార్కెట్లో ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో మరిన్ని సరికొత్త ఫీచర్లతో నయా మోడల్ బైక్‌లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం బజాజ్ 'పల్సర్ NS 200'కు అప్‌గ్రేడ్ వర్షన్‌గా.. మరిన్ని అదిరిపోయే ఫీచర్లను జోడించి 'పల్సర్ NS 400' పేరుతో సరికొత్త బైక్‌ను మార్కెట్లోకి తెచ్చారు. మరి, ఈ బైక్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Bajaj NS 400 Features in Telugu : ప్రస్తుతం బజాజ్ తన పల్సర్ బైక్ లన్నింటిన్నీ బీఎస్6 మోడల్లో విడుదల చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 'పల్సర్ NS 400' కూడా బీఎస్6 మోడల్‌గానే మార్కెట్లోకి వస్తోంది.
పల్సర్ NS400బైక్.. బజాజ్ డొమినార్ 400 మాదిరిగానే 373.3సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
అలాగే 40 పీఎస్ పవర్, 35ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సింగిల్ లిండర్తో దాని నేమ్‌ప్లేట్‌కు అనుగుణంగా పల్సర్ NS400ను పల్సర్ NS200 పెరిమీటర్ ఛాసిస్‌పై నిర్మించబడుతుంది.
ఈ బైక్ సూపర్ హ్యాండ్లింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్టు సమాచారం.