Axis Bank Numberless Credit card launched : యాక్సిస్ బ్యాంక్.. 'ఫైబ్' అనే సంస్థతో కలిసి దేశంలోనే మొదటిసారిగా నంబర్ లెస్ క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. అందులో క్రెడిట్ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ నంబర్ ఉండవు. కనుక ఈ నంబర్ లెస్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే ఆర్థిక లావాదేవీలకు అదనపు భద్రత ఉంటుంది.
సెక్యూరిటీ ఫీచర్స్
Numberless Credit Card Security Features : యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ నయా ఫిజికల్ కార్డులో.. క్రెడిట్ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ ఉండవు. కనుక యూజర్ ఐడెంటిటీని ఎవరూ గుర్తించలేరు. అలాగే కార్డ్ వివరాలను కూడా ఎవరూ చోరీ చేయలేరు. కనుక క్రెడిట్ కార్డ్ మోసాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. వినియోగదారుని భద్రత, గోప్యతలకు ఎలాంటి భంగం ఏర్పడదు.
ఎలా ఉపయోగించాలి?
యాక్సిస్ బ్యాంక్ తెచ్చిన ఈ నంబర్ లెస్ క్రెడిట్ కార్డ్‌ను.. Fibe App ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్.. చాలా ఫీచర్స్, ఆఫర్స్ అందిస్తోంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్సిస్ క్రెడిట్ కార్డ్ - ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్!
Numberless Credit Card Features :
- ఆన్లైన్ ఫుడ్ డెలివెరీపై 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దేశంలోని అన్ని రెస్టారెంట్ల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
- స్థానిక రైడ్-హెయిలింగ్ యాప్ ఖర్చులపై 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (స్థానికంగా చేసే ప్రయాణాలపై క్యాష్‌బ్యాక్)
- ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌పైన కూడా 3% వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది.
- అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- డిజిటల్ లావాదేవీలకు, అలాగే ఫిజికల్ స్టోర్స్‌లో కొనుగోళ్లు చేయడానికి ఈ నంబర్ లెస్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు.
- ముఖ్యంగా ఈ కార్డును యూపీఐతో లింక్ చేసుకోవచ్చు.
- ట్యాప్ అండ్ పే విధానం ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.
ఫీజు ఎంత ఉంటుంది?
Axis Numberless Credit Card Fee :
- ఈ ఫైబ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు. అలాగే జీవితాంతం ఎలాంటి వార్షిక రుసుము వసూలు చేయరు.
- ఈ కార్డ్ హోల్డర్లు సంవత్సరానికి 4 సార్లు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లను కాంప్లిమెంటరీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే లాంజ్‌లోకి వెళ్లి మినిమం ఛార్జీలతో నచ్చిన ఆహార పదార్థాలను తినవచ్చు.
- రూ.400 నుంచి రూ.5,000 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తే.. సర్‌ఛార్జీ నుంచి మినహాయింపు పొందవచ్చు.
- ఈ నంబర్ లెస్ క్రెడిట్ కార్డ్‌పై.. డైనింగ్, షాపింగ్ ఆఫర్స్, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ కూడా లభిస్తాయి.
- సీజనల్ సేల్స్, రూపే పోర్ట్‌ఫోలియో-రిలేటెడ్ ఆఫర్స్ కూడా ఉంటాయి.
Dormant Demat Account : మీ డీమ్యాట్ అకౌంట్.. 'ఇన్‌యాక్టివ్'గా మారిందా?.. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్లైన్ ఫెస్టివల్ ఆఫర్లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!