Axis Bank 12 EMI Off on Fast Forward Home Loans : ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలని కోరుకుంటారు. చిన్నదో.. పెద్దదో.. తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతారు. కానీ.. ఆర్థిక శక్తి అందరికీ సరిపోదు. దీంతో.. కొంత మొత్తం చేతిలో ఉన్నవాళ్లు.. మిగిలిన మొత్తాన్ని అప్పుద్వారా భర్తీచేసుకొని ఇంటి కోరిక తీర్చుకుంటారు. ఇందుకోసం చాలా మంది ఎంచుకునే మార్గం బ్యాంకు లోన్. బ్యాంకులు కూడా EMI పద్ధతిలో తిరిగి చెల్లింపునకు అనుమతి ఇస్తూ.. భారీ మొత్తంలో లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ఈ తరహా లోన్ తీసుకునే వారికి.. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్(Axis Bank) అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హోమ్ లోన్స్‌పై ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ- పైగా బోలెడన్ని బెనిఫిట్స్!
Axis Bank Fast Forward Loans: "ఫాస్ట్ ఫార్వర్డ్ లోన్" కింద యాక్సిస్ బ్యాంక్ ఈ హోమ్ లోన్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. కాల వ్యవధి ఆధారంగా కొన్ని EMIలు మాఫీ చేయనున్నట్లు తెలిపింది. పాత, కొత్త ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలుతోపాటు గృహ నిర్మాణానికి కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. వీటికి అదనంగా.. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, డోర్ స్టెప్ సర్వీస్‌ను సైతం అందిస్తోంది.
ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లోన్ పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
- పాన్‌కార్డు
- గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ కార్డు/పాస్‌పోర్ట్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్
- అడ్రస్ ప్రూఫ్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ఉద్యోగులైతే 3 నెలల Pay Slip, స్వయం ఉపాధి కలిగిన వారైతే 2 సంవత్సరాల ITR కాపీ సమర్పించాలి.