Avoid These Mistakes While Applying for PAN Card: ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. 10 అంకెలు గల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (Perminent Account Number) కొన్ని లావాదేవీలకు తప్పనిసరి. పాన్ కార్డ్ ప్రాథమికంగా ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పన్నులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గుర్తించడం, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఊపయోగిస్తుంటారు. అంతేకాదు .. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం, జీతం పొందడం లాంటి పలు రకాల ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు ఇది తప్పనిసరి.
పాన్ కార్డ్ లేనివాళ్లు, ఎక్కడైనా పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం రాగానే దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని వారాలు పట్టేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసి పాన్ కార్డ్ పొందొచ్చు. కొత్త పాన్ కార్డ్ మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో ఏవైనా వివరాలు అప్‌డేట్ చేయాలన్నా ఆన్‌లైన్‌లో సాధ్యమే. అయితే పాన్‌కార్డు అత్యవసరం ఉన్న వాళ్లు.. అప్లై చేసే సమయంలో తొందరపాటుతో కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని వల్ల మీకు రావాల్సిన పాన్ కార్డు.. లేట్ అవుతుంది. మరి ఆన్‌లైన్‌లో పాన్‌కార్డుకు ఎలా అప్లై చేయాలి..? అప్లికేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పెళ్లి తర్వాత పాన్‌కార్డులో ఇంటిపేరు మార్చాలా? - ఫోన్లోనే ఈజీగా మార్చేయండి!
ఆన్‌లైన్‌లో పాన్‌కార్డుకు అప్లై చేయడం ఎలా..?
How to Apply PAN Card in Online:
- మొదటగా.. TIN NSDL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత Quick Links లో Online PAN Services ఆప్షన్‌పై క్లిక్ చేసి Apply for PAN Online ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ టైప్‌లో New PAN-Indian Citizen సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కేటగిరి లోకి వెళ్లి Individual ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత పేరు, బర్త్ డేట్, లింగం, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి.
- గుర్తింపు కార్డు, నివాస ధ్రువత్రం, బర్త్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాలి.
- అంతా ఓకే అనుకున్న తర్వాత.. సబ్మిట్ చేసి, రిసిప్ట్ (అక్నాలెడ్జ్ మెంట్) ప్రింట్ తీసుకోవాలి
- ఆ తర్వాత ప్రింటవుట్ తీసుకున్న ఫారమ్‌పై రెండు ఫొటోలు అతికించి సంతకం చేయాలి.
- అప్లికేషన్ ఫాం, డాక్యుమెంట్లు NSDL అడ్రస్‌కు పోస్టల్ ద్వారా పంపించాలి.
- అంతే.. మీరు సమర్పించిన ఆడ్రస్‌కు వారాల వ్యవధిలో పాన్ కార్డు వచ్చేస్తుంది.