Avoid These Mistakes on Car Finance : కారు కొనుగోలు చేయడానికి ముందుగా ఓ బడ్జెట్ అనుకుంటే.. షోరూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. మరో మోడల్ నచ్చుతుంది. లేదంటే బ్రాండే మార్చాల్సి వస్తుంది. అప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది. దీంతో.. అనివార్యంగా ఫైనాన్స్ వైపు చూస్తారు. చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. అయితే.. ఈ టైమ్‌లో అవగాహనా లోపంతో ఆర్థికంగా నష్టపోతుంటారు. అందుకే.. ఈ పొరపాట్లు చేయకండి.
బడ్జెట్ క్లారిటీ : ఫైనాన్స్‌లో కారు కొనుగోలు చేసే ముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. నెలవారీ చెల్లింపులపై మీరు ఎంత ఖర్చు చేయగలరో క్లారిటీ తెచ్చుకోండి. ఇది దీర్ఘకాలం సాగే ప్రక్రియ కాబట్టి.. చెల్లింపుల్లో విఫలమైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఆఫర్‌లను కంపేర్ చేయండి : మీరు చూసే మొదటి ఫైనాన్సింగ్ ఆప్షన్ వద్దే ఉండిపోకూడదు. వివిధ కంపెనీలు, డీలర్‌షిప్‌ల వద్ద వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు, షరతులను తెలుసుకోండి. వివిధ సంస్థల ఆఫర్‌లను సరిపోల్చడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికంగా కొంత ఆదా అవుతుంది. చాలా మంది ఇది ఫాలో అవ్వరు.
నెలవారీ చెల్లింపులే కాదు :నెలవారీ EMI ముఖ్యమైన అంశమే అయినప్పటికీ.. మొత్తం రుణం పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీర్ఘకాల రుణ నిబంధనలతో తక్కువ నెలవారీ చెల్లింపు ఆప్షన్ ఇవ్వొచ్చుకానీ.. కాలక్రమేణా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. కాబట్టి తిరిగి చెల్లించే మొత్తాన్ని కూడా లెక్కించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
Car Loan Precautions : కార్ లోన్ కావాలా?.. ఈ టిప్స్ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!